RTC Rules: బ‌స్సులో క‌ల్లు తీసుకెళ్తే నేర‌మా.? ఆర్టీసీ నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి

Narender Vaitla | Published : May 9, 2025 7:32 PM
Google News Follow Us

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ వద్ద ఓ మహిళ కల్లు బాటిళ్లను ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కట్టంగూరులో జరుగుతున్న ఓ వేడుక కోసం ఈ కల్లు తీసుకెళ్లాలనుకున్న ఆమెను బస్సు కండక్టర్, డ్రైవర్ అడ్డుకున్నారు.  దీంతో బ‌స్సులో క‌ల్లు తీసుకెళ్ల‌డం నేర‌మా అన్న చ‌ర్చ మొద‌లైంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

15
RTC Rules: బ‌స్సులో క‌ల్లు తీసుకెళ్తే నేర‌మా.? ఆర్టీసీ నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి
RTC Rules

మ‌హిళ క‌ల్లును తీసుకెళ్తుంద‌న్న కార‌ణంతో ఆమెను మార్గ మాధ్యంలోనే దించేశారు. బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఆర్టీసీ అధికార‌లు చెప్పడంతో, మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "కల్లును తీసుకెళ్లొద్దని ఎక్కడ రాసి ఉంది?" అంటూ ప్రశ్నించింది. అనంతరం బస్సు ముందు నిలబడి ఆందోళన చేసింది. ఈ సంఘటన వీడియోగా నమోదై సోషల్ మీడియాలో వైరల్ అయింది.

25
TS RTC BUS

ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది మ‌హిళ‌కు మ‌ద్ధతిస్తే, మ‌రికొంద‌రు మాత్రం క‌ల్లు తీసుకెళ్ల‌డం త‌ప్పు అంటూ స్పందించారు. దీంతో ఈ అంశం చ‌ర్చ‌కు తెర తీసింది. ప్రజా రవాణా వాహనాల్లో కల్లు లేదా మద్యం తరలించడం చట్టవిరుద్ధం.

35
TGSRTC

 తెలంగాణ ఎక్సైజ్ చట్టం, 1968 ప్రకారం ప్రజల రవాణా వాహనాల్లో నిషేధిత పదార్థాలను తీసుకెళ్లడం నేరం. ఈ నిబంధనలు ప్రయాణికుల భద్రత కోసమే ఉన్నాయని, వాటిని అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నల్లగొండ బస్ డిపో రీజినల్ మేనేజర్ జానిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, బస్సుల్లో కల్లు, మద్యం, గ్యాస్ సిలిండర్లు, పచ్చిమాంసం, పెంపుడు జంతువులు వంటి వస్తువులు నిషిద్ధం. 

45
Toddy

ఆర్టీసీ వివరణకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. తెలంగాణ‌లో కల్లుకు ఓ సాంస్కృతిక భాగంగా ఉంది, మద్యం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి ఉత్పత్తులపై ఆర్టీసీ కొన్ని మినహాయింపులు ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.

ఇక మరికొందరు "బస్సుల్లో అధిక ప్రయాణికులను ఎక్కించుకోవడం, రక్షణాపరంగా లూజ్‌గా ఉండే వాహనాల నిర్వహణ" వంటి అంశాలను ప్రస్తావిస్తూ, ఆర్టీసీ రూల్స్ మాట్లాడే ముందు, ఆ సంస్థ తన రూల్స్‌ను ఎలా పాటిస్తున్నదీ గుర్తు చేసుకోవాలంటున్నారు.

55
toddy

ఈ ఘటన తెలంగాణలో కల్లుపై చర్చను తిరిగి తెచ్చింది. ఒకవైపు చట్టం, మరోవైపు ప్రజల ఆచార వ్యవహారాల మధ్య విభేదం తలెత్తింది. 

Read more Photos on
Recommended Photos