Hyderabad: హైద‌రాబాదీల‌కు గుడ్ న్యూస్‌.. పీఎం ఈ డ్రైవ్ కింద ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

Published : May 23, 2025, 03:33 PM IST

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో న‌గ‌రంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు పెద్ద ఎత్తున ప‌రుగులు పెట్ట‌నున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. 

PREV
15
పీఎం ఈ డ్రైవ్

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ నిర్ణయం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రాల సమీక్షా సమావేశంలో తీసుకున్నారు.

25
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు భారీగా ఈవీ బస్సులు

ఈ పథకం కింద కేవలం హైదరాబాద్‌కే కాకుండా బెంగళూరుకు 4,500, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. సుస్థిర రవాణా వ్యవస్థ ఏర్పాటు కోసం కేంద్రం రాష్ట్రాల సమన్వయంతో ఈవీ వాహనాల విస్తరణకు ఈ నిర్ణ‌యం ప‌నిచేస్తోంది.

35
“సుస్థిర రవాణా మా నిబద్ధత”: హెచ్‌డీ కుమారస్వామి

ఈ సందర్భంగా మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, ప్రధాని మోదీ నేతృత్వంలో నగర రవాణాను పర్యావరణపరంగా శుద్ధంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా మార్చేందుకు ఇది కీలక అడుగు అని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో భారత రవాణా రంగంలో స‌మూల మార్పు తీసుకొస్తుంద‌ని తెలిపారు.

45
రూ.10,900 కోట్లతో 14,028 బస్సుల లక్ష్యం

పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.10,900 కోట్ల వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలన్నది కేంద్ర లక్ష్యం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ బస్సుల ప్రోగ్రాంలలో ఒకటిగా నిలవనుంది.

55
ఈ-వోచర్లు, ఈ-ఆంబులెన్సులు, ఈ-ట్రక్కులు కూడా

బస్సుల సరఫరాతో పాటు కొనుగోలుదారులకు డిమాండ్ ఇన్సెంటివ్ అందించేందుకు ఈ-వోచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే త్వరలో ఈ-ఆంబులెన్సులు, ఈ-ట్రక్కులు కూడా మార్కెట్‌లోకి రానున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక వాహనాల కోసం కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది.

Read more Photos on
click me!