Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం.. సమ్మర్ హాలిడేస్ ముగిసాక కూడా మరో 100 రోజుల సెలవులు

Published : May 23, 2025, 09:13 AM ISTUpdated : May 23, 2025, 09:24 AM IST

త్వరలోనే వేసవి సెలవులు ముగియనున్నాయి. ఇది విద్యార్థులకు కాస్త బాధ కలిగించవచ్చు. కానీ వచ్చే అకడమిక్ ఇయర్ లో వచ్చే హాలిడేస్ గురించి తెలిస్తే ఇదే విద్యార్థులు ఎగిరిగంతేస్తారు. ఈ హాలిడేస్ గురించి తెలుసుకుందాం.

PREV
16
అకడమిక్ ఇయర్ 2025-26 సెలవులు

School Holidays : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు కొనసాగుతున్నాయి... ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ మూసి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ ఏప్రిల్ 24న సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి... మే మొత్తం కొనసాగే సెలవులు జూన్ 11 తో ముగియనున్నాయి. జూన్ 12న ఇరు రాష్ట్రాల్లోని స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. అంటే మొత్తంగా 50 రోజుల వేసవి సెలవులు వచ్చాయి.

26
వేసవి కంటే డబుల్ హాలిడేస్

ఇన్నిరోజుల సెలవుల తర్వాత స్కూల్ కి వెళ్లాలంటే విద్యార్థులకు కాస్త భారంగానే ఉంటుంది. ఇన్నిరోజులు చదువుల ఒత్తిడి లేకుండా ఆటాపాటలతో సరదాగా గడిపిన పిల్లలు ఒక్కసారిగా స్కూల్ కి వెళ్లాలంటే బాధగానే ఉంటుంది. అయితే వారి బాధను దూరంచేసే సమాచారం ఒకటి విద్యార్థుల కోసం అందిస్తున్నాం. వచ్చే అకడమిక్ ఇయర్ లో ఈ వేసవి సెలవులకు డబుల్ హాలిడేస్ వస్తాయి... ఈ సెలవుల గురించి తెలుసుకుందాం.

36
2025-26 అకడమిక్ ఇయర్ లో వచ్చే సెలవులెన్నో తెలుసా?

వేసవి సెలవులు మరికొద్దిరోజుల్లో ముగిసి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ను సిద్దంచేసే పనిలో నిమగ్నమయ్యింది. అంటే 2025-26 లో సిలబస్, పరీక్షల నిర్వహణతో పాటు హాలిడేస్ ను పొందుపర్చి ఈ అకడమిక్ క్యాలెండర్ ను రూపొందిస్తారు. ఇలా ఈ అకడమిక్ ఇయర్ పండగలు, జాతీయ పర్వదినాలు, సాధారణ ఆదివారం, రెండో శనివారం సెలవులు కలిపి 80-85 రోజలు వరకు ఉండే అవకాశాలున్నాయి. ఈ సెలవులు వేసవి సెలవుల కంటే ఎక్కువే అయినా వరుసగా రావన్నమాట.

46
సెలవులే సెలవులు

ఇంకా చెప్పాలంటే వచ్చే అకడమిక్ ఇయర్ లో వేసవి, ఇతర సెలవులు మినహాయిస్తే స్కూళ్లకు వర్కింగ్ డేస్ 233 రోజులే ఉండే అవకాశాలున్నాయి. ఇందులోనూ వర్షాకాలంలో వరద పరిస్థితులున్నా, వాాతావరణ మార్పులు, బంద్ లు ఉంటే సడన్ గా సెలవులు వస్తాయి. అంటే మొత్తంగా వచ్చే అకడమిక్ ఇయర్ లో మొత్తంగా 100 రోజుల వరకు సెలవులు వచ్చే అవకాశాలున్నాయి.

56
విద్యార్థులకే కాదు ఉద్యోగులకూ సెలవులు

ఇదిలాఉంటే ఇప్పటికే ఇరు తెలుగు ప్రభుత్వాలు 2025 సంవత్సరానికి సంబంధించి సెలవులు ప్రకటించింది. విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి... వేతనంతో కూడిన సాధారణ సెలవులతో పాటు ఐచ్చిక సెలవులను ప్రకటించారు. తెలంగాణలో ఈ ఏడాది 27 సాధారణ సెలవులు, 23 రోజులు ఐచ్చిక సెలవులు ప్రకటించారు... మొత్తంగా 50 రోజుల సెలవుల జాబితాను ప్రకటించారు.

66
ఏపీలో ఈ ఏడాది సెలవులెన్ని?

ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే 20 రోజులు సాధారణ సెలవులు ప్రకటించారు. అలాగే మరో 17 రోజులు ఆప్షనల్ హాలిడేస్ ప్రకటించారు. అంటే మొత్తం 37 రోజుల సెలవుల జాబితాను ప్రకటించారు. సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్ వంటి మతపరమైన పండగలతో పాటు జాతీయ పర్వదినాల సందర్భంగా ఈ సెలవులు ఇస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories