New Year Holidays : తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు నూతన సంవత్సరాది సందర్భంగా జనవరి 1న సెలవు ఉందా..? ఆఫీసులు, బ్యాంకుల సంగతేంటి… ఉద్యోగులకు సెలవు ఉంటుందా..?
New Year Holiday : న్యూ ఇయర్ కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది... రోజులు కాదు కొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టుబోతున్నాం. 2025 కు గుడ్ బై చెప్పి 2026 కు వెల్కమ్ చెప్పేందుకు యావత్ ప్రపంచం సిద్దమయ్యింది. తెలుగు రాష్ట్రాలు కూడా నూతన సంవత్సర వేడుకలకు సంసిద్దం అయ్యాయి... ఇప్పటికే చాలామంది హాలిడే ఫీల్ లోకి వెళ్లిపోయారు. మరి జనవరి 1న ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు ఉందా..?
25
జనవరి 1న ఉద్యోగులకు సెలవుందా?
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జనవరి 1న ఆప్షనల్ హాలిడే ప్రకటించాయి. అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులు... అదికూడా అవసరం అనుకుంటేనే సెలవు తీసుకోవచ్చు. ఈ ఐచ్చిక సెలవు తీసుకుంటే శాలరీ కట్ కాదు.. అంటే వేతనంతో కూడిన సెలవు లభిస్తుందన్నమాట. మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఎలాంటి అధికారిక సెలవు లేదు.
అయితే చాలా ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు జనవరి 1న సెలవు ప్రకటించాయి. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో అయితే కొన్ని ఐటీ, కార్పోరేట్ కంపెనీలు డిసెంబర్ 31, జనవరి 1 రెండ్రోజులు సెలవు ప్రకటించాయి. ఇలా ప్రైవేట్ ఉద్యోగులకు న్యూఇయర్ సెలవులు లభించాయి.
35
జనవరి 1న విద్యాసంస్థలకు సెలవుందా?
స్కూల్స్ విషయానికి వస్తే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు అధికారిక సెలవు లేదు. కాబట్టి ప్రభుత్వ స్కూల్స్ జనవరి 1న యధావిధిగా నడుస్తాయి. కానీ కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం ఈరోజు సెలవు ప్రకటించాయి. ఇప్పటికే పేరెంట్స్ కు ఈ సెలవుకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించారు. ఇలా పేరెంట్స్ తో కలిసి పిల్లలు న్యూఇయర్ వేడుకలు జరుపుకునేందుకు, కుటుంబంతో సరదాగా గడిపేందుకు వీలు కల్పిస్తూ జనవరి 1న సెలవు ప్రకటించాయి ప్రైవేట్ విద్యాసంస్థలు.
న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో బ్యాంకులు ఈరోజు మూతపడనున్నాయి. కానీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో జనవరి 1న బ్యాంకులు యధావిధిగా నడవనున్నాయి. ఆర్బిఐ ప్రకటించిన బ్యాంక్స్ హాలిడే క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సెలవు లేదు… కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులన్నీ పనిచేస్తాయి.
55
జనవరిలో సెలవులే సెలవులు
జనవరి 1న అంటే న్యూ ఇయర్ ప్రారంభమయ్యే రోజు తెలుగు రాష్ట్రాల్లో సెలవు లేకున్నా తర్వాత వరుస సెలవులు రానున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో సంక్రాంతికి ఏకంగా 9 రోజులు (జనవరి 10 నుండి 18 వరకు) సెలవులు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మరో సెలవు వస్తుంది. ఇక నాలుగు ఆదివారాలు, ఓ శనివారం సాధారణ సెలవే. ఉద్యోగులకు అయితే భారీగా ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. ఇలా జనవరిలో సగంరోజులకు పైగా సెలవులే ఉన్నాయి.