Telangana Jobs : 2026 లో నిరుద్యోగుల కలలు నిజం... ఇన్నివేల పోస్టుల భర్తీనా..!

Published : Dec 31, 2025, 09:31 AM ISTUpdated : Dec 31, 2025, 09:45 AM IST

Telangana Jobs : 2026 తెలంగాణ నిరుద్యోగులకు బాగా కలిసివచ్చే ఇయర్ కాబోతోందా..? అంటే ప్రభుత్వ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. న్యూ ఇయర్ లో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్స్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

PREV
15
2026 లో ఉద్యోగాలే ఉద్యోగాలు...

2026 Jobs Recruitment : కొత్త సంవత్సరంలో జీవితం మరింత మెరుగ్గా మారాలని అందరూ కోరుకుంటారు. ఉద్యోగులు ప్రమోషన్ రావాలని, వ్యాపారులు బిజినెస్ మరింత వృద్ధి చెందాలని, విద్యార్థులు మరింత బాగా చదవాలని కోరుకుంటారు. ఇలాగే చదువు పూర్తిచేసి ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఈ ఏడాది ఎలాగైనా జాబ్ కొట్టాలని కలలు కంటున్నారు. ఇలాంటి తెలుగు యువతీయువకుల కల 2026 నిజం కానుంది... ఈ ఏడాది తెలంగాణలో భారీ ఉద్యోగాల భర్తీ ప్రకటనలు వెలువడనున్నాయని అధికారిక వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.

25
ఏకంగా 14 వేల పోలీస్ జాబ్స్...

2026 లో భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరామని... ఈ ప్రతిపాదనలను సర్కార్ పరిశీలిస్తోందని తెలిపారు. అన్ని అనుమతులు రాగానే భారీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మెగా నోటిఫికేషన్ వెలువడుతుందని... నూతన సంవత్సరంలోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని డిజిపి స్పష్టం చేశారు.

35
ఈసారి గట్టి పోటీ తప్పదు...

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు కేవలం మూడుసార్లు మాత్రమే పోలీస్ రిక్రూట్మెంట్స్ జరిగాయి... అన్నీ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. మొదట 2016 లో 9 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు... తర్వాత 2018 ఎన్నికల వేల 16 వేలు, 2022 లో 17 వేల పోస్టులను భర్తీ చేశారు. గత మూడేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్ లేదు... దీంతో లక్షలాదిమంది యువతీయువకులు పోలీస్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువడలేదు. ఇదే సమయంలో హోంశాఖలో ప్రతిఏటా భారీగా ఉద్యోగ విరమణలు జరుగుతున్నాయి… దీంతో పోలీసులపై పని భారం పెరుగుతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2026 లో ఉద్యోగాల భర్తీ తప్పనిసరి. గత రెండుమూడేళ్లుగా జాబ్ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి 2016 లో జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గట్టి పోటీ ఉంటుంది.

45
తెలంగాణ ఆర్టిసిలో ఉద్యోగాలు

ఇక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) 84 పోస్టులు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) 114 పోస్టులు కలిపి మొత్తం 198 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది... 2026 లో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది.

55
2026 భారీగా టీచర్ జాబ్స్

నూతన సంవత్సరంలో భారీగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వ చర్యలను బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని అంగన్వాడీలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం 14 వేలకు పైగా అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల పోస్టుల భర్తీకి సిద్దమయ్యింది. నూతన సంవత్సరంలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి.

ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డిఎస్సి నిర్వహించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతర్వాత 2024 లో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించారు. ఈ సమయంలోనే ప్రతిఏటా డిఎస్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది... కానీ 2025 లో డిఎస్సి నిర్వహించలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2026 లో నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోందట. ఇలా 2026లో విద్యాశాఖలో కూడా భారీ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

Read more Photos on
click me!

Recommended Stories