Naa anveshana: పొగిడిన నోర్లే తిడుతున్నాయి.. అన్వేష్ మిస్ అయిన లాజిక్ ఏంటి.?

Published : Dec 31, 2025, 01:16 PM IST

Naa anveshana: అన్వేష్.. ఈ పేరును ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. నా అన్వేష‌ణ ఛానెల్ ద్వారా దేశ‌విదేశాల్లో ఉన్న తెలుగు వారికి చేరువ‌య్యాడీ యూట్యూబ‌ర్‌. తన‌దైన స్టైల్‌లో మాట్లాడుతూ అంద‌రినీ ఆక‌ట్టుకునే అన్వేష్ తాజాగా వివాదంలో ఇరుక్కున్నాడు. 

PREV
15
నోరు జారితే జరిగేదిదే

చేతిలో ఫోన్ ఉంది అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో తాజా ఉదాహరణ నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. ఫాలోవర్స్ ఉన్నారు అనేది బలం అనుకున్నాడు. అదే ఫాలోవర్స్ ఒక్కసారిగా భారం అవుతారనే నిజం ఆలస్యంగా అర్థమైంది. స్టేజ్ పై మాట్లాడేవాళ్లు ఆచితూచి మాట్లాడుతారు. కానీ కెమెరా ముందు ఉన్నానని కట్టడి వదిలితే సమస్య మొదలవుతుంది.

25
ప్రపంచ యాత్రికుడి నుంచి వివాదాల కేంద్రం దాకా

నా అన్వేషణ ఛానెల్ ద్వారా అన్వేష్ ప్రపంచ దేశాలు తిరిగాడు. అక్కడి ఆహారం, సంస్కృతి చూపించాడు. ఆ ప్రయాణం అతడికి గుర్తింపు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ వ్యతిరేకంగా మాట్లాడిన దశలో అతడికి అభిమానులు విపరీతంగా పెరిగారు. అదే సమయంలో అతడు ఒక స్థాయికి చేరాడు. కానీ స్థాయి పెరిగినప్పుడు మాటల బరువూ పెరుగుతుందనే విషయం గమనించలేదు.

35
ఒక కామెంట్… పెద్ద రచ్చ

నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందన ఇస్తూ అన్వేష్ అదుపు తప్పాడు. అసభ్య పదాలు వాడాడు. ఆ వివాదంలో గరికపాటి నరసింహారావును లాగాడు. అక్కడితో ఆగకుండా హిందూ దేవతల ప్రస్తావన తెచ్చాడు. రామాయణం, మహాభారతం పాత్రల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో అన్‌సబ్‌స్క్రైబ్‌ల వర్షం మొదలైంది.

45
క్షమాపణలోనూ అహంకారం

వివాదం ముదిరాక అన్వేష్ సారీ చెప్పాడు. కానీ ఆ క్షమాపణ కూడా వ్యంగ్యంగా మారింది. మాటల్లో ఆవేశం తగ్గలేదు. వినాయకుడి సన్నిధానంలో క్షమాపణలు అన్నాడు. అదే సమయంలో శాపనార్థాలు కూడా మాట్లాడాడు. దీంతో సమస్య తగ్గలేదు. ఖమ్మం, వైజాగ్ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. బీజేపీ మహిళా నేత కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. గరికపాటి పీఆర్ టీమ్ లీగల్ చర్యల హెచ్చరిక ఇచ్చింది.

55
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మిస్ అయ్యింది

అన్వేష్ ప్రయాణం చూసినవారికి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ ఉన్నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే పతనం ఖాయం. విదేశీ ఉద్యోగం వదిలి యూట్యూబ్‌లో స్థిరపడ్డాడు. ఖండాంతరాలు దాటి కంటెంట్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ వద్దు అని మరో మెట్టు ఎక్కాడు. కానీ కోపం, ఆవేశం, మాటల నియంత్రణ విషయంలో విఫలమయ్యాడు. స్థాయి పెరిగే కొద్దీ సహనం పెరగాలి. విమర్శను భరించే శక్తి రావాలి. అది లేకపోతే మనం మొదలుపెట్టిన చోటికే తిరిగి పడిపోతాం. అన్వేష్ పరిస్థితి అదే.

Read more Photos on
click me!

Recommended Stories