Miss World 2025 : ప్రపంచ సుందరీమణులతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం మరింత అందాన్ని సంతరించుకుంది. అందాల పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని కూడా ముస్తాబు చేసారు. వందకు పైగా దేశాలనుండి వచ్చిన అందగత్తెలు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడనున్నారు.
అయితే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ మిస్ వరల్డ్ పోటీలను వేదికగా చేసుకుంటామని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే నేడు (మంగళవారం) అన్నిదేశాల మద్దుగుమ్మలు చారిత్రాత్మక ప్రాంతం ఓల్డ్ సిటీలో సందడి చేయనున్నారు.