Weather : తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ .. రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయ్...!

Published : May 13, 2025, 08:17 AM ISTUpdated : May 13, 2025, 08:29 AM IST

త్వరలోనే భారతదేశంలో ఎండలు తగ్గి వర్షాలు మొదలుకానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎప్పటికంటే కాస్త ముందుగానే వర్షాకాలం మొదలుకానుందని ప్రకటించారు. మరి తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు ఎప్పుడు తాకనున్నాయో తెలుసా? 

PREV
15
Weather : తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ .. రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయ్...!
Rain Alert

Rain Alert : ప్రస్తుత మండుటెండల నుండి తెలుగు ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. వర్షాకాలం కాస్త ముందుగానే ప్రారంభం కానుందని భారత వాతావరణ శాఖ (IMD) చల్లని వార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ (మే 13 మంగళవారం) దక్షిణ అండమాన్, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. ఇవి ఈ నెలలోనే కేరళ తీరాన్ని తాకి వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.  

25
Rains

సాధారణంగా నైరుతి రుతుపవనాలు మే 20 తర్వాతే అండమాన్ కు చేరుకుంటాయి... జూన్ మొదటివారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈసారి వారంరోజులు ముందుగానే రుతుపవనాలు వస్తున్నాయి...  వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అందువల్లే వర్షాలు ముందుగానే ప్రారంభం కానున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 
 

35
Rains

మే చివర్లో కేరళను తాకే రుతుపవనాలు జూన్ మొదటివారంలో తెలుగు రాష్ట్రాలను తాకుతాయి. అంటే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో జూన్ మధ్యలో ప్రారంభమయ్యే వర్షాలు మొదటివారంలోనే ప్రారంభం అవుతాయన్నమాట. ఈసారి నైరుతి రుతుపవన కాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  

45
summer heat

ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.  మధ్యాహ్నం సుర్రుమనేలా ఎండలు కాస్తున్నాయి.. సాయంత్రం అయ్యిందంటే చాలు వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి వర్షాకాలం మొదలయ్యేవరకు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

55
summer heat

అయితే ప్రస్తుతం మండుటెండలు తారాస్థాయికి చేరుకున్నాయి... తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండలు భారీనుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని... అవసరం ఉంటేనే మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలని ప్రజలను వాతావరణ శాఖ సూచిస్తోంది. మరో పదిహేను రోజులు ఈ ఎండలుంటాయని... అప్పటివరకు తగిన జాగ్రత్తలు పాటించి బయటకు రావాలని జాగ్రత్తలు సూచిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories