గోవా నుండి హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్... కి'లేడీ' డాన్ ఆండ్ గ్యాంగ్ అరెస్ట్

First Published | Sep 12, 2023, 4:52 PM IST

హోటల్ ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్న కిలేడీతో పాటు ఆమె గ్యాంగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. 

Hyderabad

హైదరాబాద్ : హోటల్ నిర్వహణ వారి వృత్తి... డ్రగ్స్ అమ్మడం వారి ప్రవృత్తి. గోవా నుండి హైదరాబాద్ కు గుట్టుగా డ్రగ్స్ తరలించి చీకటి దందాకు తెరతీసిందో మహిళ. తన గ్యాంగ్ తో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న మహిళా స్మగ్లర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. 

Hyderabad

హైదరాబాద్ డ్రగ్స్ దందాకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా వుండే గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ప్రాంతంలో లింగంపల్లి అనురాధ(34) హోటల్ నిర్వహిస్తోంది. భర్తతో విడిపోయి ఒంటరిగా వుంటున్న ఆమె డ్రగ్స్ కు బానిసయ్యింది. మొదట హైదరాబాద్ లో కొందరు పెడ్లర్ల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసే అనురాధకు సప్లయర్స్ తో పరిచయం ఏర్పడింది. దీంతో స్వయంగా అనేరాధే డ్రగ్స్ దందా ప్రారంభించింది. 
 

Latest Videos


Hyderabad

గచ్చిబౌలికి చెందిన డ్రగ్స్ పెడ్లర్ ప్రభాకర్ రెడ్డి(38), జూబ్లీహిల్స్ కు చెందిన వెంకట శివకుమార్(33) తో కలిసి అనురాధ డ్రగ్స్ అమ్మడం ప్రారంభించిది. డిఎల్ఎఫ్ వద్ద హోటల్ ను నిర్వహిస్తూనే డ్రగ్స్ కూడా అమ్ముతుండేది. గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి గుట్టుగా హైదరాబాద్ కు తరలించి భారీ ధరకు అమ్ముకునేది. ఇలా కొకైన్ తో పాటు వివిధ రకాల మాదక ద్రవ్యాలను అమ్ముతూ లేడీ డాన్ గా మారింది అనురాధ.

Hyderabad

అయితే అనురాధ ఆండ్ గ్యాంగ్ డ్రగ్స్ దందాపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్వోటీ, మోకిలా పోలీసులు రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత ఆదివారం మద్యాహ్నం ఓఆర్ఆర్ సమీపంలో అనురాధ, ప్రభాకర్ రెడ్డి, సాయికుమార్ అరెస్ట్ చేసి వారివద్ద కొకైన్ పాకెట్లు, ఎండీఎంఏ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు సెల్ ఫోన్లు, మూడు కార్లు, రూ.97,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.  

click me!