Karthika Pournami Holiday 2025 : రేపే కార్తీక పౌర్ణమి… మరి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యాసంస్థలు, ఉద్యోగులకు సెలవు ఉంటుందా..? ఫుల్ క్లారిటీ కోసం ఈ సమాచారం అందిస్తున్నాం.
Holiday : రేపు (నవంబర్ 5, బుధవారం) కార్తీక పౌర్ణమి... హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఈ పర్వదినాన ప్రజలు వేడుకలు జరుపుకుంటారు.. ప్రతి దేశాలయం భక్తులతో నిండిపోతుంది. ఈ పండగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవుపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. సెలవు ఉంటుందని కొందరు, లేదని మరికొందరు ప్రచారం చేస్తున్నారు... ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి సెలవుపై గందరగోళం నెలకొంది. మరి రేపు తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉన్నట్లా.. లేనట్లా?
25
తెలంగాణలో అధికారిక సెలవు
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న తెలంగాణలో అయితే అధికారిక సెలవు ఉంది. ఈ మేరకు ప్రభుత్వ హాలిడే క్యాలెండర్ లో సెలవు దినంగా పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమితో పాటు సిక్కుల మతగురువు గురునానక్ జయంతి కూడా నవంబర్ 5నే. ఇలా హిందువులు, సిక్కులకు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి రేపు (బుధవారం) పూర్తిస్థాయిలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 5న సెలవు కన్ఫర్మ్. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఇలా తెలంగాణలో సెలవు విషయంలో గందరగోళం లేదు... ఆంధ్ర ప్రదేశ్ లోనే కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది.
35
ఆంధ్ర ప్రదేశ్ లో సెలవుందా..?
కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు లేదు... కానీ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే మాత్రం ఇచ్చారు. కావాలనుకుంటే మాత్రమే నవంబర్ 5న ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చు. దీంతో మహిళలు, సిక్కులు ఈ ఆప్షనల్ హాలిడేను ఎక్కువగా వాడుకునే అవకాశాలున్నాయి... మిగతా ఉద్యోగులు యధావిధిగా విధులకు హాజరవుతారు.
కేవలం ఉద్యోగులకు మాత్రమే ఈ ఆప్షనల్ హాలిడే వర్తిస్తుంది... విద్యార్థులకు కాదు. ఏపీలోని అన్ని విద్యాసంస్థలు నవంబర్ 5న యధావిధిగా పనిచేయనున్నాయి. అయితే కొన్ని హిందుత్వ ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచేవి, సిక్కు కమ్యూనిటీ పిల్లలు ఎక్కువగా చదివే ప్రత్యేక విద్యాసంస్థలకు మాత్రం సెలవు ఉండే అవకాశాలున్నాయి.
తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు బుధవారం సెలవు ముగుస్తుందో లేదో మరో రెండ్రోజుల సెలవులు రెడీగా ఉంటాయి. నవంబర్ 6, 7 (గురు, శుక్రవారం) రెండ్రోజులు మాత్రమే స్కూళ్లు నడిచేది... తర్వాత నవంబర్ 8,9 (శని, ఆదివారం) రెండ్రోజులు సెలవులే. రెండో శనివారం, ఆదివారం సందర్భంగా వీకెండ్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు, ఉద్యోగులకు కూడా రెండో శనివారం, ఆదివారం సెలవులే.
55
నవంబర్ 11న సెలవే
తెలంగాణలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతోంది... నవంబర్ 11న ఈ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ జరగనుంది. దీంతో ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చింది ప్రభుత్వం. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా సెలవే. ఈ నియోజకర్గ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ఇచ్చింది. జూబ్లీహిల్స్ లో ఓటుహక్కు కలిగిన ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించాలని అన్నిసంస్థల యాజమాన్యాలను కోరుతోంది ప్రభుత్వం.