Jobs: ఎలాంటి ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 17500 జీతం

Published : Feb 22, 2026, 12:15 PM IST

Jobs: నిరుద్యోగుల‌కుతెలంగాణ విద్యుత్ శాఖ శుభ‌వార్త తెలిపింది. హైద‌రాబాద్‌లోని కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
టీజీ ట్రాన్స్‌క‌లో భారీ అప్రెంటిస్ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ప్రసరణ సంస్థ తెలంగాణ ట్రాన్స్‌మిష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (TG TRANSCO) నిరుద్యోగ ఇంజనీరింగ్, డిప్లొమా అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం ప‌లు ఖాళీలను భర్తీ చేయనున్నారు. విద్యుత్ రంగంలో అనుభవాన్ని సంపాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.

25
ఖాళీల వివరాలు – విభాగాల వారీగా పోస్టులు

ప్రకటనలో భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ కేటగిరీలలో నియామకాలు చేపడుతున్నారు.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు – 125

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులు – 125

మిగతా ఖాళీలు సంబంధిత విభాగాల అవసరాల ప్రకారం భర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన వారు ఏడాది పాటు శిక్షణ అందిస్తారు.

35
అర్హులు ఎవ‌రంటే.?

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, సివిల్ లేదా ఐటీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత శాఖలో డిప్లొమా ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులు 2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో తమ విద్యను పూర్తి చేసి ఉండాలి. ఇతర సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులు కారు.

45
ఎలా ఎంపిక చేస్తారంటే.?

ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు. అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు కూడా లేదు. ఇది పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హిస్తారు. ఎంపికైన వారికి జీత భ‌త్యాలు ఇలా ఉంటాయి.

* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ. 17,500

* డిప్లొమా అప్రెంటిస్‌కు నెలకు రూ. 15,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు.

55
ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రక్రియ

అభ్యర్థులు ముందుగా నేష‌న‌ల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో నమోదు చేసుకుని దరఖాస్తు చేయాలి.

* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఫిబ్రవరి 20, 2026

* NATS పోర్టల్‌లో నమోదు చివరి తేదీ: ఫిబ్రవరి 26, 2026

* TG TRANSCOకు దరఖాస్తు సమర్పణ చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2026

ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువుకు ముందే అవసరమైన పత్రాలతో దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. విద్యుత్ రంగంలో ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories