ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు :
తెలంగాణలో ఈ మూడురోజులు (మంగళ, బుధ, గురువారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి , ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, నల్గొండ, గద్వాల, వనపర్తి, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.
ఇక రాజధాని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని... కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం దంచికొడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.