Farmer registry: ఈ కార్డు లేక‌పోతే ప‌థ‌కాలు ఏవీ రావు. వెంట‌నే రిజిస్ట‌ర్ చేసుకోండి

Published : May 05, 2025, 01:37 PM IST

రైతుల సంక్షేమం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ప‌థ‌కాలు నిజ‌మైన ల‌బ్ధిదారుల‌కు అందాల‌నే ఉద్దేశంతో కేంద్ర ఇటీవ‌ల కీల‌క నిర్ణ‌జ్ఞం తీసుకుంది. రైతుల కోసం ప్ర‌త్యేకంగా గుర్తింపు కార్డుల‌ను జారీ చేస్తున్నారు. ఇప్పుడీ ప్ర‌క్రియ తెలంగాణ‌లో ప్రారంభ‌మైంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
16
Farmer registry: ఈ కార్డు లేక‌పోతే ప‌థ‌కాలు ఏవీ రావు. వెంట‌నే రిజిస్ట‌ర్ చేసుకోండి

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రక్రియను ప్రారంభించింది. ఆధార్ తరహాలో, ప్రతి రైతుకు ప్రత్యేకంగా 11 అంకెల గుర్తింపు సంఖ్యను కలిగి ఉండే కార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో "ఫార్మర్ రిజిస్ట్రీ" ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం తెలంగాణలో సోమ‌వారం నుంచి ప్రారంభమైంది. మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లోని AEVOలు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
 

26

ఈ గుర్తింపు కార్డు ఎందుకు.?

ప్రస్తుతం పీఎం కిసాన్‌, పంటల బీమా, వ్యవసాయ మౌలిక సదుపాయాల వంటి పలు కేంద్ర పథకాలు అమలులో ఉన్నాయి. అయితే రైతుల వివరాలు పూర్తిగా లభించకపోవడం వల్ల పథకాల అమలు అడ్డంకులు ఎదురవుతున్నాయని కేంద్రం గుర్తించింది. ముఖ్యంగా రాష్ట్రాల నుంచి భూముల వివరాలు మాత్రమే అందుతుండగా, రైతుల వారీగా పూర్తి సమాచారం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ రైతును డిజిటల్‌గా గుర్తించే విధంగా ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు ప్రవేశపెట్టారు.
 

36

నమోదు ఎక్కడ చేయించాలి?

తెలంగాణలో ఇప్పటివరకు ఈ కార్యక్రమం వాయిదా పడగా, ఇప్పుడు ప్రారంభమైంది. మొదటగా మండల వ్యవసాయ కార్యాలయాల్లో రైతులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. త్వరలో మీసేవ కేంద్రాల ద్వారా కూడా ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది. అయితే, మీసేవ కేంద్రాల్లో వసూలు చేసే ఫీజుపై ఇంకా స్పష్టత లేదు.

46

ఏం కావాలి?

ఈ ప్రక్రియ కోసం రైతులు తమ ఆధార్ కార్డుతో పాటు పట్టాదారు పాసుపుస్తకాన్ని తీసుకెళ్లాలి. మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే ప్రాసెస్ వేగంగా పూర్తవుతుంది. లింక్ అయి లేకపోతే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ధృవీకరణ చేస్తారు.

56

ఈ కార్డు ఉప‌యోగం ఏంటి?

ఈ కొత్త గుర్తింపు కార్డును అన్ని కేంద్ర పథకాలతో అనుసంధానించనున్నారు. పీఎం కిసాన్ నిధులు ప‌డాలంటే క‌చ్చితంగా ఈ కార్డు ఉండాల‌న్న నిబంధ‌న తెస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.

66
Representativer Image (Photo: Telangana Government)

తెలంగాణ ప్రభుత్వ వివరణ

తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ, ఈ కార్డు రాష్ట్ర పథకాలైన రైతుభరోసా లేదా రుణమాఫీకి ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలో భూమి హక్కులకు రెవెన్యూశాఖ పత్రాలే ఆధారం అవుతాయని పేర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories