IMD Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో అంటే?

Published : Jul 30, 2026, 07:16 AM IST

Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఐఎండి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు. కొన్ని చోట్ల ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తోంది.

PREV
16
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. ఆ జిల్లాలకు డెంజర్ బెల్స్

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నుంచి బిగ్ అలర్ట్ వచ్చింది. ప్రస్తుతం సౌత్ ఇండియా అంతటా రుతుపవనాలు చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో వాయుగుండం తోడవడంతో సీన్ మారిపోయింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

26
తెలంగాణకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు ఎక్కడంటే..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం లెక్కల ప్రకారం గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది.

ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' ఇచ్చారు. హైదరాబాద్ లో కూడా మేఘావృతమైన ఆకాశంతో పాటు మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 28°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22°C వరకు ఉండే అవకాశం ఉంది.

36
ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, పిడుగులతో జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్ లో కూడా సీన్ తీవ్రంగానే ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

అలాగే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, కృష్ణా వంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. పిడుగుల హెచ్చరికలు కూడా ఉన్నందున ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

46
వర్షపాతం తీవ్రతను ఐఎండి ఎలా కొలుస్తుంది?

సాధారణంగా వర్షం తీవ్రతను కొలవడానికి ఐఎండి ఐదు రకాల కేటగిరీలను, నాలుగు రంగుల హెచ్చరికలను (రెడ్, ఆరెంజ్, యెల్లో, గ్రీన్) వాడనుంది.

• తేలికపాటి వర్షం: 2.5 - 15.5 మి.మీ

• మోస్తరు వర్షం: 15.6 - 64.4 మి.మీ

• భారీ వర్షం: 64.5 - 115.5 మి.మీ

• చాలా భారీ వర్షం: 115.6 - 204.4 మి.మీ

• అత్యంత భారీ వర్షం: 204.5 మి.మీ దాటితే

56
రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?

తెలంగాణలో జూలై 31 వరకు వర్షాలు గట్టిగానే పడే అవకాశం ఉన్నా, ఆగస్టు 5 వరకు గాలులతో కూడిన సాధారణ వర్షాలు కొనసాగుతాయి. గాలుల వేగం గంటకు 30-40 కిమీ వరకు ఉంటుంది. ఏపీలో ఆగస్టు 3, 4 తేదీల్లో స్వల్ప వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, కరెంట్ లేదా తాగునీటి సరఫరాలో అంతరాయాలు కలగొచ్చు.

66
ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు

తీవ్రమైన గాలులు, పిడుగులు పడే సమయంలో ప్రజలు పొరపాటున కూడా పెద్ద చెట్ల కింద గానీ, ప్రకటనల హోర్డింగ్‌ల కింద గానీ నిలబడకూడదు. తెగిపడిన కరెంట్ తీగలకు దూరంగా ఉండటం మంచిది. రైతులు తమ వ్యవసాయ పనుల ప్లానింగ్ కోసం ఐఎండి అందిస్తున్న మొబైల్ యాప్‌లను వాడాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా సమాచారం కోసం Mausam, పిడుగుల హెచ్చరికల కోసం Damini, వ్యవసాయ సలహాల కోసం Meghdoot యాప్‌లను ఉపయోగించి సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories