హైద‌రాబాద్‌లో రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్.. ప్ర‌పంచంలోనే తొలి ఆప‌రేష‌న్

Published : Oct 28, 2025, 05:55 PM IST

Hyderabad: హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ కామినేని హాస్పిటల్‌లో ఒక అద్భుత వైద్య ఘట్టం చోటుచేసుకుంది. దీర్ఘకాలిక రక్తపోటుతో బాధపడుతున్న పెట్రోల్ బంక్ కార్మికుడు రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా కొత్త జీవితం పొందాడు. 

PREV
15
సీఎమ్ఆర్ స‌ర్జిక‌ల్ రోబోట్

డాక్టర్ వి. సూర్యప్రకాశ్, సీనియర్ యూరాలజిస్ట్‌, ట్రాన్స్‌ప్లాంట్, రోబోటిక్ సర్జన్ ఈ విష‌య‌మై మాట్లాడుతూ.. “ఈ రోగి కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీర్ఘకాలిక హై బీపీ కారణంగా ఆయన డయాలిసిస్‌పై జీవిస్తున్నాడు. జీవందన్‌ కార్యక్రమం ద్వారా కిడ్నీ లభించిన తర్వాత, కామినేనిలో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని నిర్ణయించాం. సాధారణంగా ఇది ఓపెన్ సర్జరీగా చేస్తారు, కానీ ఈసారి మేము CMR సర్జికల్ రోబోట్ సహాయంతో రోబోటిక్ ట్రాన్స్‌ప్లాంట్ చేశాం. ఈ విధానం అత్యంత ఖచ్చితత్వంతో విజయవంతంగా పూర్తయింది.” అని చెప్పుకొచ్చారు. ఇది కామినేని హాస్పిటల్‌లోనే కాకుండా, ప్రపంచంలోనే మొదటి CMR సర్జికల్ రోబోట్‌తో చేసిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కావడం విశేషం.

25
రోబోటిక్ శస్త్రచికిత్స ప్రయోజనాలు

రోబోటిక్ శ‌స్త్ర‌చికిత్స ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి డాక్టర్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. “రోబోటిక్ సర్జరీలో చిన్న చిన్న కట్స్ మాత్రమే అవసరం అవుతాయి. టిష్యూ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది, రక్తస్రావం చాలా తగ్గుతుంది. రోబోటిక్ ఆర్మ్స్ శాతం శాతం ఖచ్చితంగా పనిచేస్తాయి. ప్రతి సర్జరీకి ముందు పూర్తిగా శుభ్రపరుస్తారు కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. రోగికి తక్కువ నొప్పి, వేగంగా కోలుకోవడం, తక్కువ రోజుల హాస్పిటల్‌లో ఉండడం వంటి అనేక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఊబకాయం ఉన్న రోగులకు ఈ విధానం చాలా అనుకూలంగా ఉంటుంది.” అని తెలిపారు.

35
CMR Versius Surgical Robot ప్రత్యేకత

కామినేని హాస్పిటల్‌లో ఉన్న CMR Versius Surgical Robot ప్రపంచంలోని అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్స్‌లో ఒకటి. దీని సహాయంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మాత్రమే కాకుండా..

* రాడికల్ ప్రోస్టాటెక్టమీ,

* రాడికల్ సిస్టోప్రోస్టాటెక్టమీ,

* పైలోప్లాస్టీ,

పాక్షిక నెఫ్రెక్టమీ వంటి సంక్లిష్ట శస్త్రచికిత్సలు కూడా అత్యంత భద్రతతో చేయవచ్చు.

45
హై బీపీపై అవగాహన అవసరం

సీనియర్ నెఫ్రాలజిస్ట్‌, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్‌ డాక్టర్ ఎ. సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. “హై బీపీ చాలా మంది గుర్తించకుండా ఉండే శ‌త్రువు. ఇది క్రమంగా కిడ్నీలను దెబ్బతీస్తుంది. రోబోటిక్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్స ద్వారా రోగులు వేగంగా కోలుకుంటారు. సాధారణ ఓపెన్ సర్జరీ చేసినవారు 10 రోజులపాటు ఆసుపత్రిలో ఉండాలి, కానీ రోబోటిక్ పేషెంట్‌లు మరుసటి రోజే నడవగలరు, 5 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. ఇది కిడ్నీ కేర్‌లో పెద్ద ముందడుగు.” అని అన్నారు.

55
భారత వైద్య రంగానికి కొత్త మైలురాయి

ఈ విజయవంతమైన రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కామినేని హాస్పిటల్ వైద్య చరిత్రలోనే కాకుండా ప్రపంచ వైద్య రంగంలో కూడా ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్తులో మరిన్ని అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఖచ్చితత్వంతో, తక్కువ నొప్పితో, వేగంగా కోలుకునే విధంగా జరగనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories