Hyderabad Weather: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కి వెళ్లండి.. సాయంత్రం అల్ల‌క‌ల్లోల‌మే

Published : Aug 10, 2025, 09:59 AM IST

గ‌త రెండు రోజులుగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో వ‌రుణుడు విశ్వ‌రూపం చూపిస్తున్నాడు. న‌గ‌రంలో శ‌నివారం భారీ వ‌ర్షం కుర‌వ‌గా, ఆదివారం కూడా వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. 

PREV
15
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వ‌ర్షం

హైదరాబాద్ వాసులు మరోసారి కుండపోతకు సిద్ధం కావాలని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణ వాతావరణ శాఖ, తెలంగాణ వెదర్‌మ్యాన్ తాజా అంచనాల ప్రకారం, ఆదివారం సాయంత్రం నుంచి రాత్రివరకు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం కొనసాగినా, సాయంత్రం తరువాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడనుందని సూచించారు.

DID YOU KNOW ?
మూడు సార్లు
హైదరాబాద్ లో ఈ నెలలో భారీ వర్షం కురిసింది. కేవలం పది రోజుల్లోనే మూడు సార్లు 100 మి.మి వర్షపాతం నమోదుకావడం విశేషం.
25
శ‌నివారం దంచికొట్టిన వ‌ర్షం

శ‌నివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. రెండు గంటలపాటు కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు చిన్న సరస్సుల్లా మారిపోయాయి. బేగంబజార్‌లో 117.5 మి.మీ, చార్మినార్‌లో 106.3 మి.మీ, ఖైరతాబాద్‌లో 94.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది ఆగస్టు నెలలో మూడోసారి 100 మి.మీ దాటిన వ‌ర్ష‌పాతం కావ‌డం గ‌మ‌నార్హం.

35
13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, నాగ‌ర్‌ కర్నూల్, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అత్యవసరమైతేకానీ బయటకు రాకూడదని అధికారులు సూచించారు.

45
ఈదురుగాలులతో కూడిన వ‌ర్షాలు

వాతావరణ శాఖ ప్రకారం, తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాటికి తోడు ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అకస్మాత్తుగా వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

55
హైదరాబాదీలకు ప్రత్యేక సూచనలు

* అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి

* వర్షం కురిసే స‌మ‌యంలో భారీ హోర్డింగ్‌లు, చెట్ల కింద నిల‌బడ‌కండి.

* విద్యుత్‌ తీగలు తాక‌కూడ‌దు.

* ట్రాఫిక్‌ నిలిచిపోయే ప్రాంతాలను ముందుగానే తప్పించుకోవాలి.

* వాహనాలు తక్కువ లోతైన రోడ్లలో మాత్రమే నడపాలి.

Read more Photos on
click me!

Recommended Stories