AndhraPradesh and Telangana Weather Forecast Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో వారం రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు తీవ్ర కావచ్చు. గాలి వేగం గంటకు 40–50 కిమీ వరకు ఉండొచ్చు.
AndhraPradesh and Telangana Weather Forecast Update: గతవారం రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నారు. ప్రధానంగా హైదారాబాద్ లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ అయ్యిందా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది? ఎక్కడెక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం.
25
తెలుగు రాష్రాలకు ఐఎండీ అలర్ట్
భారత వాతావరణం శాఖ వెల్లడించిన రిపోర్టు ప్రకారం.. శనివారం (నేడు) కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే తెలంగాణలో ఆగస్టు 9 నుంచి 14 వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రెండు రోజులపాటు గాలి వేగం గంటకు 40-50 కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా.
35
తెలంగాణ వాతావరణం
శాటిలైట్ అంచనాల ప్రకారం.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున నుంచి చిరు జల్లులు పడతాయి. రోజంతా మేఘావృత వాతావరణం ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో వర్షం ప్రారంభమై, క్రమంగా జోరుగా భారీ వర్షంగా మారే అవకాశం ఉంది. అలాగే.. పలు ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. గాలి, ఉష్ణోగ్రతలు విషయానికి వస్తే.. తెలంగాణలో 28°C సరాసరి ఉష్ణోగ్రత నమోదు అవకాశముంది. అలాగే.. గాలి గంటకు 12 కిమీ వేగంలో వీచే అవకాశముంది. ఇక తేమ శాతం విషయానికి వస్తే.. పగటివేళ 70 శాతం ఉండగా.. రాత్రి వేళ 90 శాతంగా ఉండబోతుంది.
ఏపీలో రోజంతా మేఘాలు కమ్ముకొని, మేఘావృత వాతావరణం ఉంటుంది. సాయంత్రం 3 గంటల తర్వాత కోస్తా, ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షం ప్రారంభమవుతుంది. క్రమంగా అది పెరిగి సాయంత్రం వరకు భారీ వర్షంగా మారవచ్చు. రాత్రి 7 తర్వాత రాయలసీమలో వర్షం మొదలై అర్థరాత్రి వరకూ పడుతుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలి, ఉష్ణోగ్రతలు విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో 33°C సరాసరి ఉష్ణోగ్రత నమోదు కాగా, గాలి గంటకు 13 కిమీ వేగంలో వీచే అవకాశముంది. ఇక తేమ శాతం విషయానికి వస్తే.. పగటివేళ 58 శాతం ఉండగా.. రాత్రి వేళ 94శాతంగా ఉండబోతుంది. ఈ పరిస్థితులు సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలకు అనుకూలంగా ఉంటాయి.
55
వచ్చే వారం రోజులు వర్షాలే వర్షాలు.
రెండు రాష్ట్రాల్లో మరో వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. మేఘాల కవరేజీ విస్తారంగా ఉంది. ఆగ్నేయాసియాలో ‘పొదుల్’ తుపాను తైవాన్ వైపు గంటకు 100 కిమీ వేగంతో కదులుతోంది. అంతేకాక అంటార్కిటికా నుంచి వచ్చే చల్లని గాలులు, మేఘాలు కూడా వర్షాలను పెంచే అవకాశం ఉంది.
ప్రయాణికులకు సూచనలు: నేడు వాతావరణం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. గోతులు, జారి పడే పరిస్థితులు ఉండే అవకాశముంది. అలాగే.. గాలి వేగంగా వీచ్చే అవకాశం ఉన్నందున గంటకు 40-50 కిమీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించకూడదు. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఉండకూడదు