Weather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక .. మరో ఐదు రోజులపాటు వర్షాలే వర్షాలు.. ఈ పాంత్రాల్లో కుండపోత వానలు..

Published : Aug 10, 2025, 07:16 AM IST

AP, Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో ముంపు, ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

PREV
15
మరో ఐదు రోజులపాటు వర్షాలే వర్షాలు

తెలుగు రాష్ట్రాలపై వరుణుడు రుద్రం రూపం దాల్చాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే వారం పాటు పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. తీర ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమ, తెలంగాణ దాకా పలు జిల్లాలు తడిసి ముద్దయ్యే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా, తేమ శాతం అధికంగా ఉండనుండటంతో వాతావరణం మరింత ఉక్కపోతగా మారే అవకాశం ఉంది. కొన్నిచోట్ల గాలివానలు, ముంపు, రోడ్ల రవాణా అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.

25
ఉత్తర భారతంపై వరుణుడి ప్రతాపం.

భారత వాతావరణ విభాగం (IMD) తాజా అంచనాల ప్రకారం, వచ్చే వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చే 7 రోజులు వర్షాలు కొనసాగనున్నాయి. ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బిహార్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో కూడా ఐసొలేటెడ్ హెవీ రైన్‌ఫాల్ కురిసే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్‌లో వచ్చే 3-4 రోజులు వర్షపాతం తక్కువగా ఉంటుందని అంచనా.

ప్రధానంగా పశ్చిమ యూపీ, దక్షిణ బిహార్ ప్రాంతాల్లో ఉపరితల చక్రవాతాలు కొనసాగుతున్నాయి. ఇక గుజరాత్ నుంచి పశ్చిమ యుపి వరకు ట్రఫ్ లైన్ ఏర్పడింది. ఆగస్టు 13 నాటికి వాయువ్య , పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా జమ్మూ-కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ, యుపిలో కొన్ని రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ భారతంలో తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర తీరప్రాంతంలో కొన్ని రోజులు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

35
తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక

భారత వాతావరణ విభాగం (IMD) తాజా అంచనాల ప్రకారం వచ్చే వారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 40–50 కి.మీ. వరకు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. తీర ఆంధ్రప్రదేశ్‌పై ఏర్పడే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.

ఉష్ణోగ్రతలు, తేమ వివరాలకు వస్తే.. తెలంగాణ లో నేడు ( ఆదివారం) పగటి పూట ఉష్ణోగ్రత: 28°C–31°C నమోదు కాగా, రాత్రి వేళ కనిష్ఠ ఉష్ణోగ్రత: 21°C–23°C నమోదయ్యే అవకాశం ఉంది. ఇక

తేమ శాతం: 80%–90% గా ఉంది. ఇక గాలి గంటకు 30–45 కి.మీ. ల వేగంతో వీచే అవకాశం ఉంది.

భారీ వర్షాలు కురిసే జిల్లాలు: వనపర్తి, జోగులాంబ గడ్వాల్, నారాయణపేట్, మహబూబ్‌నగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

45
ఆంధ్రప్రదేశ్ వాతావరణం

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. తీర ఆంధ్రప్రదేశ్, యానాంలో వచ్చే 4 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఉష్ణోగ్రతలు, తేమ: పగటిపూట ఉష్ణోగ్రత: 27°C–30°C ఉండగా, రాత్రి పూట ఉష్ణోగ్రత: 22°C–24°C గా నమోదుకానున్నాయి. తేమ శాతం: 78%–88% గా నమోదుకానున్నాయి. గాలి వేగం: గంటకు 35–50 కి.మీ. వేగంలో వీచే అవకాశం ఉంది. (తీరప్రాంతాల్లో మరింత ఎక్కువ).

ప్రభావిత జిల్లాలు: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే జిల్లాల విషయానికి వస్తే.. తీర ఆంధ్రప్రదేశ్, యానాం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్సార్ కడప, తూర్పు చిత్తూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.

మత్స్యకారుల హెచ్చరిక: బంగాళాఖాతంలో ఆగస్టు 9–14 వరకు గాలులు బలంగా వీచే అవకాశం ఉందన్నందున ఉత్తర ఆంధ్ర తీర, దక్షిణ ఒడిశా తీరంలో సముద్రయానానికి వెళ్లరాదని అధికారులు సూచిస్తున్నారు. 

55
హైదరాబాద్ పై వరణుడి రుద్రరూపం

శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్‌ను అల్లకల్లోలంగా మార్చేసింది. చెట్ల కొమ్మలు విరిగిపడి రహదారులపై పడిపోవడం, నాలాలు పొంగిపోవడం, డ్రైనేజీల నుంచి మురుగునీరు రోడ్లపైకి రావడం వల్ల నగరంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పలు ప్రాంతాల్లో రోడ్లు పాడై, నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జామ్‌ అయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అధికారులు ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం,హైదరాబాద్ లో ఉదయం వేళ ఎండ, మేఘాల మిశ్రమ వాతావరణం ఉండగా, మధ్యాహ్నం 2 తర్వాత జల్లులు మొదలై సాయంత్రానికి మోస్తరు వర్షాలుగా మారతాయి. ఈ వర్షాలు అర్థరాత్రి వరకు కొనసాగుతాయని అంచనా. వచ్చే రెండు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారులపై నీటి ముంపు, చెత్త పేరుకుపోవడం, చెట్లు విరిగిపడే ప్రమాదాల దృష్ట్యా ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories