హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి

Published : Nov 25, 2025, 07:18 PM IST

Hyderabad : హైదరాబాద్ ప్రజలారా… ఈ రెండ్రోజులు నీటిని కాస్త పొదుపుగా వాడుకొండి. ఎందుకంటే నగరంలో నీటి సరఫరా నిలిచిపోనుందని జలమండలి అధికారులు ముందే హెచ్చరిస్తున్నారు. 

PREV
14
హైదరాబాద్ కు వాటర్ బంద్

Hyderabad : నగరవాసులు ముందుగానే జాగ్రత్తపడితే మంచిది... ఎందుకంటే రేపు (నవంబర్ 26, బుధవారం) హైదరాబాద్ లో నీటి సరఫరా నిలిచిపోనుంది. నగరంలో ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాలో పాక్షిక అంత‌రాయం ఏర్పడుతుందని HMWSSB (హైదరాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లై ఆండ్ సీవరేజ్ బోర్డ్) ప్రకటించింది. నిర్వహణ పనులకోసమే హైదరాబాద్ లో కృష్ణా జలాల సరఫరాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

24
నీటి సరఫరా ఎందుకు నిలిచిపోతోంది..?

హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1,2 & 3 పంపింగ్ స్టేషన్లకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేసే బ‌ల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ (CT)ల స్థానంలో కొత్తవి అమర్చడానికి సిద్దమయ్యారు అదికారులు. ఈ క్రమంలోనే నాసర్లపల్లి జలమండలి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కెవి సబ్ స్టేషన్లకు 26.11.2025, బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈరోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అంటే 6 గంటల పాటు టీజీ ట్రాన్స్ కో విద్యుత్ సరఫరా నిలిపివేస్తోందని జలమండలి ప్రకటించింది.

విద్యుత్ సరఫరా లేకుంటే నీటి సరఫరా కూడా నిలిచిపోతుంది. అందుకే 26.11.2025, బుధవారం రోజున జలమండలి సరఫరా చేసే కృష్ణా ఫేస్ -1,2 & 3 ల‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో పాక్షిక అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదో జలమండలి అధికారులు ముందుగానే ప్రకటించారు... కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు ముందుజాగ్రత్తగా నీటిని పొదుపుగా వాడుకోవాలి.

34
నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

1. ఓ అండ్ ఏం డివిజన్ నం-1 : చార్మినార్

2. ఓ అండ్ ఏం డివిజన్ నం-2 : వినయ్ నగర్

3. ఓ అండ్ ఏం డివిజన్ నం-3 : బొజగుట్ట

4. ఓ అండ్ ఏం డివిజన్ నం-4 : రెడ్ హిల్స్

5. ఓ అండ్ ఏం డివిజన్ నం-5 : నారాయణ గూడ

6. ఓ అండ్ ఏం డివిజన్ నం-6 : ఎస్ ఆర్ నగర్

7. ఓ అండ్ ఏం డివిజన్ నం-7 : మారేడ్ పల్లి

8. ఓ అండ్ ఏం డివిజన్ నం-8 : రియాసత్ నగర్

9. ఓ అండ్ ఏం డివిజన్ నం-9 : కూకట్ పల్లి

10. ఓ అండ్ ఏం డివిజన్ నం-10 : సాహెబ్ నగర్

11. ఓ అండ్ ఏం డివిజన్ నం-11 : హయత్ నగర్

12. ఓ అండ్ ఏం డివిజన్ నం-13 : సైనిక్ పురి

13. ఓ అండ్ ఏం డివిజన్ నం-14 : ఉప్పల్

14. ఓ అండ్ ఏం డివిజన్ నం-15 : హఫీజ్ పేట్

15. ఓ అండ్ ఏం డివిజన్ నం-16 : రాజేంద్ర నగర్

16. ఓ అండ్ ఏం డివిజన్ నం-18 : మణికొండ

17. ఓ అండ్ ఏం డివిజన్ నం-19 : బోడుప్పల్

18. ఓ అండ్ ఏం డివిజన్ నం-20 : మీర్ పేట్ డివిజన్ ప్రాంతాలు.

44
నీటి సరఫరా ఎప్పుడు పునరుద్దరిస్తారు..?

బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే విద్యుత్ ఉండదు... కాబట్టి నీటి సరఫరాకు అంతరాయం ఈ ఒక్కరోజే ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత యదావిధిగా విద్యుత్ సరఫరా ఉంటుందని చెబుతున్నారు. కానీ నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్ నుండి హైదరాబాద్ కు నీటిసరఫరా కొంత ఆలస్యం కావచ్చు. గురువారం (నవంబర్ 27) నుండి నగరంలో కృష్ణా నీటి సరఫరా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories