తెలుగు మహిళలకు గుడ్ న్యూస్.. పైసా వడ్డీ లేకుండా ప్రభుత్వ డబ్బులు, ఎవరు అర్హులు?

Published : Nov 25, 2025, 04:08 PM IST

Interest Free Loans for Telangana Womens : పైసా వడ్డీ లేకుండా ప్రభుత్వం నుండి డబ్బులు పొందవచ్చు. ఇందుకు ఎవరు అర్హులు, ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
వడ్డీలేకుండానే రుణాలు పొందండి...

Interest Free Loans : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు విడతల్లో వడ్డీలేని రుణాలను అందించిన ప్రభుత్వం మరోసారి పైసా వడ్డీ లేకుండా మరిన్ని రుణాలు ఇచ్చేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం ఏకంగా రూ.304 కోట్లు విడుదల చేసింది... ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి (మంగళవారం, నవంబర్ 25) నుండి అర్హులైన మహిళలకు చెక్కులు పంపిణీ చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు.

25
వడ్డీలేని రుణాలు పొందేందుకు ఎవరు అర్హులు

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు నేరుగా కాకుండా మహిళా సంఘాలద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తుంది. అంటే స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు ఈ రుణాలను పొందేందుకు అర్హులన్నమాట. బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తూ మంచి రికార్డు కలిగిన మహిళా సంఘాలకు ఈ వడ్డీలేని రుణాలు అందనున్నాయి... ఎవరికి రుణాలు ఇవ్వాలన్నది అధికారులు నిర్ణయిస్తారు.

35
వడ్డీలేని రుణాలతో ఎంతమందికి లబ్ధి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే భారీగా వడ్డీలేని రుణాలు ఇచ్చింది... గ్రామీణ ప్రాంతాల్లో రూ.1118 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.300 కోట్లకుపైగా వడ్డీలేని రుణాలు అందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు మరో రూ.304 కోట్లు విడుదలచేసింది... ఈ డబ్బులు రాష్ట్రంలోని అన్ని మహిళా స్వయంసహాయక సంఘాలకు అందనున్నాయి. తద్వారా రాష్ట్రంలోని మూడున్నర లక్షలకు పైగా మహిళా సంఘాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.

45
ఎమ్మెల్యేల చేతులమీదుగా చెక్కుల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల కోసం విడుదలచేసిన రూ.304 కోట్లను ఎలా పంపిణీ చేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించింది. ఆర్థిక మంత్రి భట్టి దీనిపై సీఎస్, ఆర్థిక శాఖ ముఖ్య కారదర్శి, సిర్ప్ సీఈవో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గకేంద్రాల్లో ఈ వడ్డీలేని రుణాలకు సంబంధించి చెక్కుల పంపిణీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అర్హులైన మహిళా సంఘాలకు చెక్కులు అందించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.

55
ఎన్నికల కోసమేనా ఈ రుణాలు..?

తెలంగాణలో త్వరలోనే పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి… ఇందుకోసం కసరత్తు జరుగుతోంది. ఇలాంటి ఈ సమయంలో చీరల పంపిణీ చేపట్టడం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు విడుదలచేయడం ఎన్నికల జిమ్మిక్కేనని బిఆర్ఎస్, బిజెపి ఆరోపిస్తున్నాయి. 

మహిళా సంఘాలను ఈ రుణాలపేరిట మభ్యపెట్టే అవకాశాలున్నాయని... అందుకే చెక్కుల పంపిణీని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం మహిళా సాధికారత, నిరుపేద కుటుంబాల కోసమే ఇలా SHG మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories