Hyderabad ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే టాప్ 5 చెరువులివే... మీరూ ఈ వీకెండ్ ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా గడపొచ్చు

Published : Aug 02, 2025, 03:58 PM ISTUpdated : Aug 02, 2025, 04:02 PM IST

Hyderabad Lakes Tourism : హైదరాబాద్ లో ఆహ్లాదరకమైన వాతావరణం కలిగిన చెరువులు అనేకం ఉన్నాయి. నగరవాసులు ఇక్కడికి కుటుంబంతో వెళ్లి హాయిగా గడపొచ్చు. ఇలాంటి టాప్ 5 చెరువుల గురించి తెలుసుకుందాం.  

PREV
16
హైదరాబాద్ చెరువులు

Hyderabad : మన పూర్వీకులు అడవుల్లో నివసించేవారని చెబుతుంటే విన్నాం, ఈ తరం పుస్తకాల్లో చదువుకుంటోంది… ప్రస్తుతం ఆ అడవులన్నీ నాశనమై పోతులున్నాయి. మనిషి తన అవసరాల కోసం చెట్లను నరికేసి కాంక్రీట్ జంగల్స్ నిర్మిస్తున్నాడు... అభివృద్ధి వెంటపడుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నాడు. దీంతో హైదరాబాద్ వంటి నగరాల్లో చెట్ల కోసం వెతుక్కునే పరిస్థితి వచ్చింది.

అయితే హైదరాబాద్ కు అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ నగరానికి వారసత్వంగా కొన్ని చెరువులు వచ్చాయి... వీటి చుట్టు ఎప్పుడూ పచ్చదనం ఉంటుంది. ఇలా సహజంగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఈ చెరువుల వద్ద పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేశారు పాలకులు. ఇలా నగరవాసులు సాయంత్రం సమయంలో హాయిగా భార్యాపిల్లలతో వెళ్లి సరదాగా గడపొచ్చు... అలాంటి చెరువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

DID YOU KNOW ?
భారత్ లో అత్యధిక పర్యటకులు సందర్శించే ప్రాంతం
భారతదేశంలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రాంతం తాజ్ మహల్. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈ పురాతన కట్టడాన్ని చూసేందుకు నిత్యం వేలాదిమంది వెళుతుంటారు.
26
1. హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)

హైదరాబాద్ అనగానే గుర్తుకువచ్చే వాటిలో ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ ఉంటుంది. హైదరాబాద్ నడిబొడ్డున గల ఈ చెరువు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మధ్యలో నిలువెత్తు బుద్దుడి విగ్రహం, మరోపక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం, ఇంకొపక్క ఆకాశమంత ఎత్తులో ఎగిరే భారీ జాతీయ జెండా, ఇంకోవైపు తెలుగు మహానుభావుల విగ్రహాలు... ఇలా హుస్సేన్ సాగర్ తీరం అద్భుతాలతో నిండివుంది. ఇక నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పై సాయంత్రం నడక ఆహ్లాదకరంగా ఉంటుంది.

హైదరాబాద్ లో ఉండేవారు వీకెండ్ లో సాయంత్రం భార్యాపిల్లలతో సరదాగా అలా వెళ్లిరావాలంటే హుస్సెన్ సాగర్ పర్ఫెక్ట్ ప్లేస్. ఇక ప్రేమికులు, స్నేహితులు కూడా సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎన్టీఆర్, లుంబిని పార్క్ లు కూడా హుస్సేన్ సాగర్ తీరంలోనే ఉన్నాయి.

36
2. దుర్గం చెరువు

హైదరాబాద్ ను పాలించిన కుతుబ్ షాహీ పాలకులకు తాగునీరు అందించింది ఈ దుర్గం చెరువు. ఇక్కడినుండే గోల్కొండ కోటకు, చుట్టుపక్కల ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే తర్వాతికాలంలో హైదరాబాద్ విస్తరణ కారణంగా ఈ చెరువు కుచించుకుపోయి ఆదరణ కోల్పోయింది. కానీ ఈ చెరువుపై ఇటీవల నిర్మించిన తీగల వంతెన సరికొత్త అందాలను అద్దింది... దీంతో దుర్గం చెరువుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సాయంత్రం సమయంలో విద్యుత్ వెలుగు మధ్య ఈ తీగల వంతెనపై నడక, డ్రైవింగ్ అద్భుతంగా ఉంటుంది.

46
3. ఉస్మాన్ సాగర్ చెరువు

హైదరాబాద్ లో ఉండేవారికి గండిపేట పేరు సుపరిచితమే. ఉస్మాన్ సాగర్ నే గండిపేట చెరువు అనికూడా అంటారు. చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో దీని నిర్మాణం జరిగింది కాబట్టి ఉస్మాన్ సాగర్ గా పిలవబడుతోంది. ఈ జలాశయం ఒడ్డున ఆ నీటిసవ్వడిని, స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ సరదాగా గడపవచ్చు. హైదరాబాద్ శివారులో ప్రకృతి అందాలమధ్య కుటుంబంతో ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్.

56
4. హిమాయత్ సాగర్

హైదరాబాద్ శివారులోని మరో అద్భుతమైన జలాశయం హిమాయత్ సాగర్. దీన్నికూడా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిజాం నవాబులు నిర్మించారు. ఈ చెరువు పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి... సాయంత్రం సమయంలో రిజర్వాయర్ ఆ నీటిని చూస్తూ గడపడం ఆహ్లాదకరంగా ఉంటుంది.

66
5. సరూర్ నగర్ చెరువు

దిల్ సుఖ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈ చెరువు సుపరిచితమే. దీన్ని మినీ ట్యాంక్ బండ్ గా పిలుస్తారు. ఇది చాలా పురాతనమైన చెరువు. ఇక్కడికి ప్రతిరోజు వందలాదిమంది సరదాగా గడిపేందుకు వస్తుంటారు... వీకెండ్ లో అయితే రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ మినీ ట్యాంక్ బండ్ పై కూడా కుటుంబంతో ఆనందంగా గడపొచ్చు.

ఇవే కాకుండా హైదరాబాద్ ఇంకా చాలా చెరువులు ఉన్నాయి. సఫిల్ గూడ, ఆల్వాల్, బతుకమ్మ కుంట, రామంతాపూర్, షామీర్ పేట్, అమీన్ పూర్, జీడిమెట్ల, ఐడిఎల్, నెక్నాంపూర్, ప్రగతినగర్, కీసర, సూరారం వంటి అనేక చెరువులు హైదరాబాద్ లో ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ మంచినీటాలో ఆహ్లాదాన్ని పంచుతుంటే కొన్నిమాత్రం మురికి నీటితో దుర్గందాన్ని వెదజల్లుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories