హైదరాబాద్ టూ బెంగళూరు 3 గంటల్లోనే.. కల కాదు నిజంగానే నిజం కానుంది.

Published : Aug 21, 2025, 12:02 PM IST

దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ వేగంగా పరుగులు పెడుతోంది. ముంబై - అహ్మదాబాద్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తవ్వకముందే మరో ప్రాజెక్టు దిశగా అడుగులు పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

PREV
15
హైదరాబాద్‌ నుంచి మెట్రో నగరాలకు బుల్లెట్ రైలు..

హైదరాబాద్‌ను పొరుగు రాష్ట్రాల్లోని మెట్రో నగరాలతో కలిపే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో వేగం పుంజుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌–ముంబయి హైస్పీడ్ రైలు మార్గానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) రైల్వే బోర్డు వద్దకు చేరగా, చెన్నై, బెంగళూరు దిశగా కూడా పనులు వేగవంతమయ్యాయి. ఈ రైళ్లు గంటకు గరిష్ఠంగా 350 కి.మీ., సగటున 250 కి.మీ. వేగంతో పరిగెత్తేలా ప్రణాళిక చేస్తున్నారు.

DID YOU KNOW ?
మూడు గంటల్లో ప్రయాణం
ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరులకు రైలు ప్రయాణం 12–13 గంటలు పడుతోంది. బుల్లెట్ రైలు ద్వారా ఈ సమయాన్ని మూడు గంటలకు తగ్గించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు.
25
హైదరాబాద్‌–ముంబయి మార్గం వివరాలు

ముంబయి కారిడార్ DPRలో మొత్తం 11 స్టేషన్లు ప్రతిపాదించారు. ఈ మార్గం తెలంగాణలో సుమారు 170 కి.మీల పొడవుగా ఉండనుంది. రాష్ట్రంలో హైదరాబాద్‌, జహీరాబాద్‌ రెండు స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ఆమోదం అనంతరం భూసేకరణ, నిధుల కేటాయింపు వంటి కీలక దశలు ప్రారంభమవుతాయి. చెన్నై, బెంగళూరు మార్గాలు కలిపి చూస్తే రాష్ట్రంలో హైస్పీడ్ ట్రాక్ మొత్తం 580 కి.మీ. ఉంటుంది.

35
కొత్త మార్గాలపై పరిశీలనలు

చెన్నై, బెంగళూరు మార్గాల తుది సర్వే పనులు రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రాథమిక ఎలైన్‌మెంట్ సిద్ధం కాగా, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సూచనలు సేకరించిన తర్వాతే ఖరారు చేస్తారు. ఇటీవల రైట్స్ అధికారులు తెలంగాణ ఉన్నతాధికారులతో సమావేశమై మార్గాలపై చర్చించారు. కాజీపేట మార్గం పెద్దగా ఉన్న నేపథ్యంలో నల్గొండ మార్గం లేదా జాతీయ రహదారి 65 వెంట వెళ్లే అవకాశాలపై ఎక్కువగా చర్చ నడుస్తోంది. చివరగా వీటిలో ఒక మార్గాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.

45
కేంద్రం–రాష్ట్రాల చర్చలు

ముంబయి–అహ్మదాబాద్‌ బుల్లెట్ రైలు పూర్తయిన తర్వాత హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు ప్రాజెక్టులు చేపడతామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రితో భేటీ అయినప్పుడు కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

55
మూడు గంటల్లో ప్రయాణం

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరులకు రైలు ప్రయాణం 12–13 గంటలు పడుతోంది. బుల్లెట్ రైలు ద్వారా ఈ సమయాన్ని మూడు గంటలకు తగ్గించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గాలను పూర్తిగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌లలో నిర్మిస్తారు. పాత ట్రాక్‌లకు సంబంధం లేకుండా, కేవలం హైస్పీడ్ రైళ్ల కోసం మాత్రమే ఈ మార్గాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్‌ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూరు మాత్రమే కాకుండా, కర్నూలు, విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు చేరుకోవడం మరింత వేగవంతమవుతుంది. వ్యాపారం, విద్య, ఐటీ రంగాలకు కూడా ఇది పెద్ద ఊతమని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories