Telangana, Andhra Pradesh Weather LATEST update: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Telangana, Andhra Pradesh Weather LATEST update: తెలుగు రాష్ట్రాలకు ఏమైంది..? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగ బట్టాడా? గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వానలు కురిశాయి. వర్షాలు, వరదల వల్ల తీవ్ర నష్టం చేకూరింది. వానలు అంటే భయపడాల్సి వస్తోంది. మరో మూడురోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆ వివరాలెంటో తెలుసుకుందాం..
25
మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గాలి వేగం 30-40 kmph) కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే.. భద్రాద్రి కోతగూడెం, ఖమ్మం, ములుగు, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ వంటి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయబడింది వాతావరణ శాఖ.
35
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఇక ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మిశ్రమంగా ఉంది. రాష్ట్రంలోని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతాలు, గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 33°C, కనిష్టం 24°C వరకు నమోదు కావచ్చు. వాయు వేగం 10-20 kmph మధ్యగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వ్యక్తం చేసింది.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే... నేడు ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. తేలికపాటి వర్షాలు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 31°C, కనిష్టం 22°C గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గాలి వేగం గంటకు 30-40 kmph ఉండనున్నది. వర్షం కారణంగా తాగునీరు, రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్ జాగ్రత్తలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండడం సలహా.
55
ప్రాజెక్ట్ లకు జలకళ
గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వాగులు, వంకలు, ప్రాజెక్టులు జలకళతో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్లు దెబ్బతినడం, పంట పొలాలు నీటమునిగిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రత్యేకంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి పెరగడం వలన రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయబడింది. ఈ వాతావరణ పరిస్థితులు సాధారణ ప్రజలు, రైతులు, వాహనయాత్రికులందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.