చిత్రవిచిత్రమైన డ్రెస్సులేసే ఈ తెలుగు యూట్యూబర్ ఆదాయమెంతో తెలుసా? : లగ్జరీ డూప్లెక్స్ హౌస్ కట్టేసుకున్నాడుగా..!

Published : Aug 20, 2025, 08:28 PM IST

విచిత్రమైన దుస్తులు ధరించి మరింత చిత్రవిచిత్రమైన హావభావాలతో వీడియోలు చేసే తెలుగు యూట్యూబర్ టిక్‌టాకర్ తరుణ్ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. ఇంద్రభవనంలాంటి లగ్జరీ డూప్లెక్స్ ఇళ్లు కట్టుకున్నాడు. అతడి యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా? 

PREV
15
లగ్జరీ ఇంట్లోకి అడుగుపెట్టిన యూట్యూబర్ తరుణ్ నాయక్

మనం ఫోన్ పట్టుకుని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి వీడియో తరచూ కనిపిస్తుంటుంది.. చిత్రవిచిత్రమైన వేషధారణలో కనిపించే అతడిని చూసి చాలామందికి 'వీడేంట్రా బాబు... ఇలా ఉన్నాడు'' అనిపిస్తుంటుంది. కానీ అతడు మాత్రం ఏమాత్రం సిగ్గుపడకుండా తనపని తాను చేసుకుంటూ వెళుతుంటాడు... వీడియోలు పెడుతూనే ఉంటాడు. ఇదే అతడిని సోషల్ మీడియా స్టార్ ని చేసింది. ఇలా చిత్రవిచిత్రమైన డ్రెస్సింగ్ తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన తెలుగు యువకుడు టిక్ టాకర్ తరుణ్ నాయక్ తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబంతో కలిసి తన కలల ఇంట్లోకి అడుగుపెట్టాడు.

25
టిక్ టాకర్ తరుణ్ నాయక్ లగ్జరీ హౌస్ స్టోరీ

సోషల్ మీడియాలో టిక్ టాకర్ తరుణ్ వీడియోలు చాలామందికి చిరాకు తెప్పించవచ్చు. కానీ అతడికి ఈ వీడియోల ద్వారా మంచి ఆదాయమే వస్తోంది. ఈ డబ్బులతోనే అతడు ఇళ్ళు కట్టుకున్నాడని అందరూ భావిస్తున్నారు... దీని గురించి చాలామంది తనను అడుగుతున్నారని తరుణ్ తెలిపాడు. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఆదాయం, ఇంటి నిర్మాణం గురించి తరుణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

35
టిక్ టాకర్ తరుణ్ నాయక్ యూట్యూబ్ ఆదాయమెంత?

తాను చేసే వీడియోలకు మంచి వ్యూస్ వస్తాయి... కానీ చాలా తక్కువ ఆదాయం వస్తుందని టిక్ టాకర్ తరుణ్ వెల్లడించారు. కేవలం యూట్యూబ్ నుండే తనకు డబ్బులు వస్తున్నాయని... ఇటీవల అవికూడా తగ్గాయన్నారు. యూట్యూబ్ నుండి ప్రస్తుతం నెలకు రూ.10,000 నుండి రూ.15,000 వరకు ఆదాయం వస్తోందని తరుణ్ వెల్లడించారు. గత ఏడాది కాలంగానే తనకు యూట్యూబ్ నుండి ఆదాయం వస్తోందని... ఆరంభంలో రూ.30,000 వరకు వచ్చేది కానీ ఇప్పుడు ఆ ఆదాయం బాగా తగ్గిందని తరుణ్ తెలిపారు.

తరుణ్‌కి యూట్యూబ్‌లో 2.9 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. టిక్‌టాక్‌లో తరుణ్ పోస్ట్ చేసిన ఓ వీడియో కేవలం ఒక్క రోజులోనే 10 మిలియన్ల వ్యూస్ పొందింది. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యాక ఇతడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా తరుణ్ నాయక్ పనిచేస్తున్నారు.

45
కొత్త ఇంటి గురించి తరుణ్ చెప్పిన నిజాలు..

ఇక తమ కొత్త ఇంటి గురించి తెలియజేస్తూ... ఇది తన డబ్బులతో నిర్మించలేదని తరుణ్ స్పష్టం చేశాడు. తన వీడియోలకు యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోతుంది... అలాంటిది ఇంతపెద్ద ఇళ్లు ఎలా కడతానని అన్నాడు. తల్లి, సోదరుడి కష్టార్జితంతో పాటు కొంత భూమిని అమ్మి ఇల్లు కట్టుకున్నామని... ఇది తన సంపాదనతో కట్టినట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని తెలిపారు. యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయమే తప్ప తాను ప్రమోషన్స్ కూడా చేయట్లేదని టిక్ టాకర్ తరుణ్ తెలిపారు.

55
యూట్యూబర్ తరుణ్ నాయక్ వ్యక్తిగత జీవితం

ఇదిలావుంటే టిక్ టాకర్ తరుణ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అతడు తల్లి, సోదరుడితో కలిసి జీవిస్తున్నాడు. అతడి చిన్నతనంలోనే తండ్రి కరెంట్ షాక్ తో మరణించాడు... అప్పటినుండి తల్లే ఆలనాపాలనా చూసుకుంది. డిగ్రీ పూర్తిచేసిన అతడు హైదరాబాద్ లో ఉంటున్నాడు... జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా టిక్ టాకర్ తరుణ్ వెల్లడించారు.

టిక్ టాకర్ తరుణ్ నాయక్ గృహప్రవేశం వీడియోకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read more Photos on
click me!

Recommended Stories