పెద్ద ప్లాన్ వేసిన నెట్‌ఫ్లిక్స్‌.. హైద‌రాబాద్‌లో 41వేల చ‌ద‌ర‌పు అడుగుల ఆఫీస్‌. ఏం చేయనున్నారంటే.?

Published : Nov 02, 2025, 08:29 AM IST

Hyderabad: ప్ర‌ముఖ కంటెంట్ క్రియేష‌న్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ హైద‌రాబాద్‌లో వ్యాపార విస్త‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగానే హైటెక్ సిటీలో భారీ ఎత్తున కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నుంది. ఇంత‌కీ నెట్‌ఫ్లెక్స్ ప్లానింగ్ ఏంటంటే.? 

PREV
15
హైటెక్ సిటీలో..

స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందుకోసం హైటెక్‌ సిటీలో సుమారు 41,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం భారతదేశంలో కంటెంట్‌ తయారీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌, VFX (విజువల్‌ ఎఫెక్ట్స్‌) రంగాల్లో బలమైన నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో ఉన్న మంచి మౌలిక వసతులు, నైపుణ్యమున్న సిబ్బంది ఈ నగరాన్ని గ్లోబల్‌ మీడియా కేంద్రంగా మార్చే దిశగా సహకరిస్తున్నాయి.

25
హైదరాబాద్‌ ఎందుకు ప్రత్యేకం?

గత దశాబ్దంలో హైదరాబాద్‌ టెక్నాలజీ, మీడియా రంగాలకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. దీనికి కారణం.. మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సృజనాత్మక ప్రతిభ, ప్రభుత్వ ప్రోత్సాహం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను సినిమా నిర్మాణం, యానిమేషన్‌, VFX, డిజిటల్‌ ప్రొడక్షన్‌ హబ్‌గా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు స్టూడియోలు, OTT కంపెనీలు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయి. నెట్‌ఫ్లిక్స్‌ ఇక్కడ ఆఫీస్‌ ఏర్పాటు చేయడం ద్వారా నగరంలోని మీడియా రంగంపై మరింత నమ్మకం ఏర్ప‌డ‌డానికి కార‌ణ‌మైంది. కొత్త ఆఫీస్‌లో ప్రాంతీయ కంటెంట్‌ అభివృద్ధి, ప్రొడక్షన్‌ పర్యవేక్షణ, టెక్నికల్‌ వర్క్‌ఫ్లోలు, వెండర్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాలపై ప్రత్యేక టీమ్‌లు పనిచేస్తాయి.

35
ప్రాంతీయ కంటెంట్‌పై దృష్టి

భారతదేశం నెట్‌ఫ్లిక్స్‌కు సాంస్కృతిక వైవిధ్యం ఉన్న పెద్ద మార్కెట్‌. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో కంటెంట్‌ తయారీదారులతో నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికే భాగస్వామ్యాలు పెంచుతోంది. హైదరాబాద్‌ ఈ దిశలో కీలక పాత్ర పోషించనుంది, ఎందుకంటే ఇది తెలుగు సినిమా పరిశ్రమకు కేంద్రం. నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాదులో ఉండడం వల్ల దక్షిణ భారత కంటెంట్‌కు మరింత ప్రాధాన్యం లభిస్తుందని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇది కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులు, ప్రతిభావంతుల భాగస్వామ్యాలకు దారితీస్తుంది.

45
VFX, యానిమేషన్‌ రంగం

హైదరాబాద్‌ ఇప్పుడు VFX, యానిమేషన్‌ రంగంలో కూడా ముందుకు సాగుతోంది. ఇమేజ్‌ టవర్స్‌ వంటి ప్రాజెక్టులు దీనికి నిదర్శనం. నెట్‌ఫ్లిక్స్‌ భాగస్వామ్య సంస్థ Scanline VFX కూడా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించాలని ప్రకటించింది. దీని వల్ల నగరంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయి.

55
ఏయే రంగాలు లాభ‌ప‌డ‌తాయంటే.?

క్రియేటివ్‌ ఉద్యోగాలు: ఎడిటింగ్‌, డైరెక్షన్‌, స్క్రిప్టింగ్‌, యానిమేషన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ రంగాల్లో కొత్త అవకాశాలు ల‌భిస్తాయి.

లోకల్‌ స్టూడియోలు: స్థానిక స్టూడియోలు, ఫ్రీలాన్స్‌ ఆర్టిస్టులు, కంటెంట్‌ ఏజెన్సీలకు కొత్త ప్రాజెక్టులు ల‌భిస్తాయి.

ప్రాంతీయ కథనాలు: తెలుగుతో పాటు దక్షిణ భారత కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకి చేరుతాయి.

అంతర్జాతీయ సహకారం: రైటర్స్‌ వర్క్‌షాపులు, ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లు, సృజనాత్మక మార్పిడి కార్యక్రమాలను నిర్వ‌హిస్తారు.

హైదరాబాద్‌ ఇప్పుడు ఐటీతో పాటు నూతన వినోద రంగంలోనూ ఆవిష్కరణల నగరంగా మారుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories