Hyderabad: నగరంలో మెట్రో సేవలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో మెట్రో వివరాలను తెలుసుకోవడానికి ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా తాజాగా మెట్రో టైమింగ్స్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, మెట్రో రైలు సేవలు చాలామందికి ఉపశమనంగా మారాయి. ఉద్యోగులు, విద్యార్థులు, రోజూ ప్రయాణించే వేలాది మంది ప్రజలకు ఈ మార్పులు కీలకం కానున్నాయి. ఇదిలా ఉంటే నవంబర్ 3 నుంచి మెట్రో రైళ్ల సమయాల్లో కొత్త షెడ్యూల్ అమల్లోకి రానుంది.
25
నవంబర్ 3 నుంచి అమల్లోకి
హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటించిన ప్రకారం, ఇకపై రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. ఈ సమయం అన్ని మార్గాల్లోనూ, టెర్మినల్ స్టేషన్లలోనూ వర్తిస్తుంది. అంటే, ఏ లైన్‌లో ప్రయాణించినా ప్రయాణికులు ఒకే టైమ్ టేబుల్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది.
35
ఇప్పటి వరకు టైమింగ్స్ ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం వారపు రోజుల్లో (సోమవారం నుంచి శుక్రవారం వరకు) ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు సేవలు అందుబాటులో ఉన్నాయి. శనివారం రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే రైళ్లు నడుస్తున్నాయి.
కొత్త నిర్ణయంతో వారంలో అన్ని రోజులు ఒకే సమయపట్టిక అమలులో ఉంటుంది. ఇది ప్రయాణికులకు పెద్ద సౌలభ్యం కలిగించే మార్పు. ఇక ఆదివారాలు కూడా ఉద్యోగుల తరహాలోనే ఉదయం 6 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభమవుతాయి.
55
రద్దీ నియంత్రణకు మెట్రో కొత్త ప్లాన్
ప్రతిరోజూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పీక్ అవర్స్ (ఉదయం 8 నుండి 10, సాయంత్రం 6 నుండి 8)లో రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
ప్రయాణికులకు మరింత సౌలభ్యం
కొత్త టైమింగ్స్‌తో ప్రయాణికులు తమ పనుల ప్రకారం మెట్రోను మరింత సులభంగా వినియోగించుకోగలరు. నగర ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంలో ఈ మార్పులు కీలక పాత్ర పోషించనున్నాయి. మెట్రో సంస్థ తెలిపిన ప్రకారం, ఈ కొత్త షెడ్యూల్ నవంబర్ 3 నుంచే అమల్లోకి వస్తుంది.