Hyderabad: ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలు నేడు రియల్ ఎస్టేట్ హబ్‌గా మారాయి. ఆ సమయంలో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. రానున్న రోజుల్లో డెవలప్ కానున్న అలాంటి ఓ ప్రాంతమే మల్లంపేట.
మల్లంపేట అభివృద్ధికి ప్రధాన కారణాల్లో ఒకటి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 4A ప్రారంభం. ఈ మార్గం ప్రారంభమైన తర్వాత నగరంలోని కీలక ప్రాంతాలకు చేరుకోవడం చాలా సులభమైంది. హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌లు, వ్యాపార కేంద్రాలు, ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్లడానికి ఇప్పుడు మల్లంపేట నుంచి ప్రయాణం మరింత వేగంగా మారింది. మంచి రహదారి సౌకర్యం ఉండటంతో ఈ ప్రాంతం నివాసానికి అనుకూలంగా మారుతోంది.
25
విద్యా సంస్థలకు దగ్గరగా ఉండటం మరో ప్లస్
మల్లంపేట పరిసర ప్రాంతాల్లో మంచి విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొల్లూరు ప్రాంతంలో అంతర్జాతీయ విద్యా సంస్థలు మల్లంపేట నుంచి సుమారు 20 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉన్నాయి. దీంతో పిల్లలకు మంచి విద్య అందించాలనుకునే కుటుంబాలకు ఈ ప్రాంతం మంచి ఎంపికగా మారుతోంది. భవిష్యత్తులో మరిన్ని విద్యాసంస్థలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
35
ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువ ధరలు
రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులను మల్లంపేట వైపు ఆకర్షిస్తున్న మరో ముఖ్య అంశం ఇక్కడి భూమి ధరలు. పక్కనే ఉన్న కొల్లూరులో చదరపు అడుగు ధరలు సుమారు రూ. 7,500 నుంచి రూ. 8,000 వరకు ఉండగా, మల్లంపేటలో ప్రస్తుతం సుమారు రూ. 5,000 వరకు మాత్రమే ఉన్నాయి. అంటే తక్కువ ఖర్చుతో మంచి ప్రాంతంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఇక్కడ లభిస్తోంది. అందుకే మధ్యతరగతి కుటుంబాలు, కొత్త పెట్టుబడిదారులు మల్లంపేటపై ఆసక్తి చూపుతున్నారు.
మల్లంపేట నుంచి హైదరాబాద్‌లోని అనేక కీలక ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 40 నిమిషాలు. ఎల్‌బీ నగర్, విజయవాడ హైవే ఓఆర్ఆర్ ద్వారా త్వరగా చేరుకునే వీలు ఉంది. కండ్లకోయ IT పార్క్, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలన్నింటికీ దాదాపు 45 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉండటంతో ఉద్యోగులకి ఇది అనుకూల ప్రాంతంగా మారుతోంది.
55
భవిష్యత్తులో మరో మియాపూర్‌గా మల్లంపేట?
కొన్ని సంవత్సరాల క్రితం మియాపూర్ కూడా ఇలాగే నగర శివారుల్లో ఉండేది. కానీ మెట్రో, ఐటీ అభివృద్ధి, రోడ్లు వంటి సదుపాయాల వల్ల అది ఇప్పుడు హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఒకటిగా మారింది.
అదే విధంగా మల్లంపేట కూడా భవిష్యత్తులో మరో మియాపూర్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. మంచి కనెక్టివిటీ, తక్కువ ధరలు, విద్యాసంస్థలు, ఐటీ కేంద్రాలకు దగ్గరగా ఉండటం వంటి అంశాలు ఈ ప్రాంత అభివృద్ధికి బలంగా మారుతున్నాయి. అందుకే చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడే మల్లంపేటలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ విలువలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సూచనలు పాటించడమే మంచిది.