వాతావరణ శాఖ వివరాల ప్రకారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మంగళవారం నుంచి వర్షాలు కురిసే అవకాశముందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అధికారులు తెలిపారు.