ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం

Published : Sep 15, 2026, 02:53 PM IST

Hyderabad: హైద‌రాబాద్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఒక‌ప్పుడు శివారు ప్రాంతాల‌న్నీ ఇప్పుడు న‌గ‌రంలో క‌లిసి పోతున్నాయి. ఇలాంటి వాటిలో కొంప‌ల్లి ఒక‌టి. చిన్న గ్రామీణ ప్రాంతంగా ఉన్న కొంప‌ల్లి ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది

PREV
15
గ్రామీణ వాతావరణం నుంచి నగర జీవనశైలికి..

కొంపల్లి అభివృద్ధిలో ప్రధానంగా కనిపించే మార్పు.. ఇక్కడి జీవనశైలిలో వచ్చిన పరివర్తన. గతంలో కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు ఎక్కువగా కనిపించేవి. హైదరాబాద్‌ ప్రధాన నగర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ జనసాంద్రత కూడా తక్కువగానే ఉండేది. అయితే నగరం ఉత్తర దిశగా విస్తరించడం, మేడ్చ‌ల్‌ వైపు రహదారి కనెక్టివిటీ పెరగడం, ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు సమీపం వంటి అంశాలు కొంపల్లికి కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి.

నేడు కొంపల్లిలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు పెరుగుతున్నాయి. కుటుంబాలతో నివసించేందుకు అవసరమైన అనేక సదుపాయాలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రతిరోజూ నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కొంతమేర తగ్గింది. ముఖ్యంగా కుటుంబాలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు కొంపల్లి ఒక ప్రత్యామ్నాయ నివాస ప్రాంతంగా మారింది.

25
హాస్పిటల్స్‌, రెస్టారెంట్లు.. షాపింగ్‌తో మారిన రూపురేఖలు

ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతోందా లేదా అనేది అక్కడ పెరుగుతున్న కమర్షియల్‌ కార్యకలాపాలను చూస్తే కొంతవరకు అర్థమవుతుంది. ఆ విషయంలో కొంపల్లి గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. హాస్పిటల్స్‌, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, సూపర్‌ మార్కెట్లు, ఫ్యాషన్‌ స్టోర్లు వంటి అనేక వ్యాపారాలు ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి.

ముఖ్యంగా ఫుడ్‌, రిటైల్‌ రంగంలో బ్రాండెడ్‌ సంస్థల ప్రవేశం కొంపల్లి మార్కెట్‌పై ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. కేఫ్ నిలోఫ‌ర్ వంటి ప్రముఖ బ్రాండ్‌ కొంపల్లిలో భారీ అవుట్‌లెట్ తీసుకొచ్చేందుకు ప్ర‌యాత్నాలు చేస్తుండ‌డంఈ ప్రాంతంలో పెరుగుతున్న వినియోగదారుల మార్కెట్‌కు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం కొంపల్లి ప్రాంతానికి సంబంధించిన ఆన్‌లైన్‌ లిస్టింగ్స్‌లోనూ కేఫ్‌ నిలోఫర్‌ కనిపిస్తోంది. అదే సమయంలో ఫ్యాషన్‌ రిటైల్‌ రంగంలో స్టైల్ యూనియ‌న్ ఇప్పటికే కొంపల్లిలో స్టోర్‌ను కలిగి ఉంది. మ్యాక్స్ ఫ్యాష‌న్‌ను కూడా కొంపల్లి ప్రాంతంలో స్టోర్‌ ఉంది.

35
పెద్ద బ్రాండ్ల రాకతో పెరుగుతున్న కమర్షియల్‌ హబ్‌ ఇమేజ్‌

కొంపల్లిలో ఇప్పుడు కనిపిస్తున్న మరో ముఖ్యమైన మార్పు.. షాపింగ్‌ కల్చర్‌. ఒకప్పుడు అవసరమైన వస్తువుల కోసం నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం దుస్తులు, ఫ్యాషన్‌, ఫుడ్‌, రోజువారీ అవసరాలకు సంబంధించిన అనేక ఆప్షన్లు స్థానికంగానే లభిస్తున్నాయి. జుడియో, మ్యాక్స్‌, స్టైల్‌ యూనియన్‌ వంటి ఫ్యాషన్‌ బ్రాండ్లు కొంపల్లి మార్కెట్‌లో తమ ఉనికిని పెంచుకున్నాయి. దీనివల్ల స్థానికంగా షాపింగ్‌ చేసే వారి సంఖ్య పెరగడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వినియోగదారులు కొంపల్లి వైపు రావడానికి అవకాశం ఏర్పడింది.

ఇక తాజాగా ప్రముఖ వస్త్ర సంస్థ మెండ్ (MEND) కూడా కొంపల్లిలో మెన్స్‌వేర్‌ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి కొత్త బ్రాండ్లు వరుసగా రావడం వల్ల కొంపల్లి కేవలం నివాస ప్రాంతంగా కాకుండా రిటైల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫుడ్‌ డెస్టినేషన్‌గా కూడా తన పరిధిని పెంచుకుంటోంది. ఒక ప్రాంతంలో ఇలాంటి బ్రాండెడ్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టడం సాధారణంగా అక్కడి వినియోగదారుల మార్కెట్‌పై ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది.

45
కండ్లకోయ ఐటీ పార్క్‌.. భవిష్యత్‌పై ఆసక్తి పెంచుతున్న ప్రాజెక్ట్‌

కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల భవిష్యత్‌ అభివృద్ధిలో కండ్లకోయ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కండ్లకోయ గేట్‌వే ఐటీ పార్క్‌ ప్రతిపాదన ఉత్తర హైదరాబాద్‌లో ఐటీ కార్యకలాపాలను విస్తరించాలనే ఆలోచనలో భాగంగా వచ్చింది. 2022లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది. సుమారు 10 ఎకరాల్లో ఐటీ టవర్‌ను అభివృద్ధి చేయాలనే ప్రణాళిక ఉండగా, ఐటీ కార్యాలయాలతో పాటు ఇతర కమర్షియల్‌, హాస్పిటాలిటీ, నివాస సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆశించిన స్థాయిలో సాగ‌డం లేదు. కానీ భ‌విష్య‌త్తుల్లో మ‌ళ్లీ ఈ ప్రాజెక్ట్ ప‌రుగులు పెట్టే అవ‌కాశం ఉందని ప‌లువురు భావిస్తున్నారు. ఒకవేళ ఈ తరహా ఐటీ, కమర్షియల్‌ ప్రాజెక్టులు వేగం పుంజుకుంటే మాత్రం ఉత్తర హైదరాబాద్‌లో ఉద్యోగాలు, నివాస డిమాండ్‌, రిటైల్‌ కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

55
భూముల ధరల నుంచి జీవనశైలి వరకు.. కొంపల్లి పూర్తిగా మారింది

కొంపల్లి అభివృద్ధికి మరో స్పష్టమైన సూచన ఇక్కడి భూములు, నివాస ఆస్తులపై పెరిగిన ఆసక్తి. మూడు దశాబ్దాల క్రితం నగర శివారులో ఉన్న ప్రాంతంగా ఉన్నప్పుడు ఇక్కడ భూముల ధరలు నేటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేవి. కానీ నగరం విస్తరించడం, రహదారి కనెక్టివిటీ, నివాస ప్రాజెక్టులు, కమర్షియల్‌ సంస్థలు, చుట్టుపక్కల అభివృద్ధి వంటి అంశాలు కలిసి కొంపల్లి భూముల విలువను గణనీయంగా పెంచాయి.

అయితే కొంపల్లిలోని ప్రతి ప్రాంతంలోనూ ఒకే రకమైన ధరలు ఉండవు. ప్రధాన రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, కమర్షియల్‌ ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, మంచి కనెక్టివిటీ ఉన్న లొకేషన్లకు సాధారణంగా ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. అందువల్ల కొంపల్లి మొత్తం ఒకే ధరకు ఉందని చెప్పడం కంటే.. లొకేషన్‌ ఆధారంగా ధరల్లో తేడాలు ఉన్నాయని చూడాలి.

మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు హైదరాబాద్‌ శివారులోని చిన్న గ్రామీణ ప్రాంతంలా కనిపించిన కొంపల్లి ఇప్పుడు నగర జీవనశైలికి దగ్గరవుతోంది. హాస్పిటల్స్‌, రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫ్యాషన్‌ స్టోర్లు, నివాస ప్రాజెక్టులు పెరగడంతో స్థానికంగా అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. కండ్లకోయలో ప్రతిపాదిత ఐటీ అభివృద్ధి కూడా భవిష్యత్‌పై ఆసక్తిని పెంచుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories