Hyderabad: ఇరాన్ యుద్ధానికి మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటనకు.. లింకు ఏంటబ్బా.?

Published : Mar 17, 2026, 04:33 PM IST

Hyderabad: మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో సంచ‌న‌లంగా మారింది. టీడీపీ ఎంపీ, బీఆర్ఎమ్ ఎమ్మెల్యేలు మాదక ద్రవ్యాలు తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. కాగా తాజాగా ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

PREV
15
ఫామ్‌హౌజ్‌లో ఏమైంది? పోలీసుల ఎంట్రీతో హైడ్రామా

హైదరాబాద్‌ సమీపంలోని మొయినాబాద్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్‌లో జరిగిన పార్టీ ఒక్కసారిగా పెద్ద వివాదానికి దారితీసింది. వీకెండ్ వేళ నిర్వహించిన ఈ గ్యాదరింగ్‌లో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు పాల్గొనడం గమనార్హం. పోలీసులు అకస్మాత్తుగా దాడి చేయడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. సాధారణ పార్టీ కాదనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఇందులో మరింత లోతైన అంశాలు ఉన్నాయా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.

25
సీక్రెట్ మీటింగ్

ఈ సమావేశం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న చ‌ర్చ ప్ర‌కారం ఇది కేవలం వినోద కార్యక్రమం కాకుండా కీలక అంశాలపై చర్చించేందుకు ఏర్పాటైన సమావేశమనే వాదనలు వినిపిస్తున్నాయి. పాల్గొన్న వారి నేపథ్యాలు, వారి మధ్య ఉన్న సంబంధాలు పరిశీలిస్తే… ఇది ముందుగా ప్లాన్ చేసిన సమావేశంగా కనిపిస్తోందని అంటున్నారు. పోలీసుల రాకతో ఆ చర్చ మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

35
దుబాయ్‌తో లింకేంటి.?

ఈ ఘటనలో దుబాయ్ పేరు వినిపించడం మరింత ఆసక్తికరంగా మారింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడి వ్యాపార వాతావరణం ప్రభావితం అవుతోందని విశ్లేషణలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది ప్రముఖులు దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ పెట్టుబడుల భద్రతపై చర్చించేందుకే ఈ సమావేశం జరిగిందని అంటున్నారు.ముఖ్యంగా వ్యాపారవేత్త కేదార్ మరణం తర్వాత ఈ వ్యవహారం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఆ ఘటనకు ఈ సమావేశానికి సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

45
బీఆర్ఎస్‌లో కలకలం: రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు

ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశంగా దీనిని ప‌రిగ‌ణించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, వారం రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ సరైనదిగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

55
అటు చంద్రబాబు కూడా..

ఈ కేసులో తన పేరు వినిపించడంపై ఏలూరు ఎంపీ పుట్ట మ‌హేష్ కుమార్ స్పందించారు. తాను కేవలం స్నేహితుడి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, ఎలాంటి అక్రమాలకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ ఘటనపై ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా సీరియస్‌గా స్పందించారు. పూర్తి రిపోర్ట్ సమర్పించాలని ఆదేశిస్తూ, పార్టీ పరువు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంపీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ వచ్చే వరకు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories