Jeevan Reddy : అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా?

Published : Mar 17, 2026, 12:31 PM IST

Jeevan Reddy Resignation : సాధారణంగా ప్రతిపక్ష పాార్టీల నుండి అధికార పార్టీలోకి చేరికలు ఉంటాయి. కానీ తెలంగాణలో అధికార కాంగ్రెస్ నుండి ప్రతిపక్ష పార్టీలో ఓ మాజీ మంత్రి చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయన ఎవరో తెలుసా?

PREV
15
కాంగ్రెస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనాామా..?

Jeevan Reddy : ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే... మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి హవా కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచిన ఘనత అతడిది. చివరకు తెలంగాణ కాంగ్రెస్ (TPCC) అధ్యక్ష రేసులో కూడా నిలిచారు. ఇలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎందుర్కొంటున్నారు. పార్టీలో సరైన గౌరవం, గుర్తింపు దక్కకపోవడంతో దాదాపు 40 ఏళ్ళుగా మోసిన కాంగ్రెస్ కండువాను ఇక దించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే సుధీర్ఘకాలం పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి రాజీనామా చేయడం... అదీ అధికారంలో ఉండగా చేయడం తెలంగాణ కాంగ్రెస్ పెద్ద ఎదురుదెబ్బే. ఇప్పటికే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడతారంటూ ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్దమవడం కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పెట్టింది. మరి జీవన్ రెడ్డి పార్టీని వీడటానికి దారితీసిన అంశాలు... ఆయన ఏ పార్టీలో చేరతారు..? తదితర విషయాల గురించి ఇక్కడ చర్చిద్దాం.

25
జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను ఎందుకు వీడుతున్నారు..?

తాటిపర్తి జీవన్ రెడ్డి... తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని కుటుంబంనుండి వచ్చి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి స్థాయికి చేరుకున్నారు.

అయితే ఇటీవల జీవన్ రెడ్డికి రాజకీయంగా గుర్తింపు తగ్గింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినా జగిత్యాలలో మాత్రం ఓడిపోయింది. ఇక్కడ జీవన్ రెడ్డిపై బిఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. తాను ఓడినా కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది కాబట్టి తనకు తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుందని భావించారు. కానీ బిఆర్ఎస్ నుండి పోటీచేసి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అధికార కాంగ్రెస్ లో చేరారు... దీంతో జీవన్ రెడ్డి పరిస్థితి దారుణంగా మారింది.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం జగిత్యాల పగ్గాలు అప్పగించాయి... దీంతో సీనియర్ లీడర్ జీవన్ రెడ్డికి గుర్తింపులేకుండా పోయింది. ఈ విషయంలో చాలాసార్లు ఆయన అసహనం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే సంజయ్ ను బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్ పెద్దలు, టిపిసిసి చీఫ్ వద్దకు కూడా జగిత్యాల పంచాయితీ చేరింది... ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ దే పైచేయిగా నిలిచింది. ఇలా సొంతపార్టీలోనే జీవన్ రెడ్డికి ప్రాధాన్యం లేకుండాపోయింది.

35
పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ముదిరిన వివాదం...

జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య గత రెండేళ్లుగా వర్గపోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు... అతడితో కలిసి పనిచేయబోనని కరాకండిగా చెప్పేశాడు. దీంతో జగిత్యాల కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది.

అయితే ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో అదిష్టానం సంజయ్ వర్గీయులకే ఎక్కువగా అవకాశం ఇచ్చిందంటూ జీవన్ రెడ్డి తిరుగుబాటు చేశాడు. తన అనుచరులను ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిపారు... వారితరపున ప్రచారం కూడా నిర్వహించి కొందరిని గెలిపించుకున్నారు.

ఇలా మున్సిపల్ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు జీవన్ రెడ్డి. అప్పుడే ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, ఇతర నాయకులు బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు... కానీ ఆలోచనను మార్చుకోలేదు. తాజాగా ఎట్టి పరిస్థితుల్లోనూ జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

45
జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరతారు..?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడటం ఖాయమయ్యింది... ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన భారత రాష్ట్ర సమితి (BRS) లో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ (BJP) కూడా అతడిని పార్టీలో చేర్చుకునే ఆలోచనలో ఉందట. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీంతో జీవన్ రెడ్డి ఎటు వెళతారన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

అయితే బిఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరారు... కాబట్టి ఆ పార్టీలో చేరేందుకు జీవన్ రెడ్డికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఇప్పటికే బిఆర్ఎస్ నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం... ఉగాది, రంజాన్ పండగల తర్వాత జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అధికారికంగా జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన, ఆ తర్వాత ఏ పార్టీలో చేరతారనే ప్రకటన వెలువడేవరకు జరిగేదంతా ప్రచారం మాత్రమే. ఒక్కటిమాత్రం నిజం... ఆయన కాంగ్రెస్ ను వీడటం ఖాయంగా కనిపిస్తోంది. జగిత్యాలలోని జీవన్ రెడ్డి కార్యాలయం, ఇంటివద్ద కాంగ్రెస్ ప్లెక్సీలు, కటౌట్లను అనుచరులు తొలగించారు. కేవలం జీవన్ రెడ్డి ఒక్కరే ఉన్న ప్లెక్సీలు వెలిశాయి... దీన్నిబట్టి ఆయన రాజీనామాపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఏ పార్టీలో చేరతారో క్లారిటీ రావాల్సి ఉంది.

55
జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం...

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం బత్కేపల్లి జీవన్ రెడ్డి స్వగ్రామం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగానే సాగింది... ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఏ, ఎల్ఎల్బి పూర్తిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో 1983 లో సినీనటులు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు జీవన్ రెడ్డి... జగిత్యాల నుండి పోటీచేసి గెలిచారు. అతి చిన్న వయసులోనే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలోనూ పనిచేశారు.

1985 లో టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరిన జీవన్ రెడ్డి ఇప్పటివరకు ఇదే పార్టీలో కొనసాగారు. మధ్యలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఎమ్మెల్యేగానే కాదు ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది.. కరీంనగర్ లోక్ సభకు కూడా పోటీచేశారు. సుధీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగిన జీవన్ రెడ్డి ఇప్పుడు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories