డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి నేతృత్వంలో డా. సాగర్ చంద్రశేఖర్ భుయార్, డా. ఎన్. శివ ప్రసాద్ నాయుడు, డా. అమరేంద్ర కుమార్ సింగ్, డా. పర్వత్రాజ్ వరుణ్ గౌతమ్, డా. సుబ్రహ్మణ్యం కలిసి ప్రత్యేక విధానంతో చికిత్స నిర్వహించారు. కాలి రక్తనాళం ద్వారా సన్నని ట్యూబ్‌ను గుండె వరకు చేర్చి, ఆధునిక ఇమేజింగ్ పద్ధతుల సహాయంతో వాల్వ్ లీకేజ్‌ను గణనీయంగా తగ్గించారు. ఈ ప్రక్రియలో ఛాతీ తెరవాల్సిన అవసరం లేకపోవడం, రక్తస్రావం తక్కువగా ఉండడం ప్రధాన ప్రయోజనాలు.
రోగిలో స్పష్టమైన మెరుగుదల
చికిత్స అనంతరం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉంది. శ్వాసలో గణనీయమైన మార్పు కనిపించడంతో రోజువారీ పనులను స్వయంగా నిర్వహించగలుగుతున్నారు. డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి మాట్లాడుతూ, వృద్ధుల్లో కనిపించే అలసట, శ్వాసకోశ ఇబ్బందులను తేలికగా తీసుకోకూడదన్నారు. ముందస్తు పరీక్షలతో సమస్యను గుర్తిస్తే సురక్షితమైన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మెడికవర్ ఆసుపత్రి వర్గాలు ఇలాంటి అత్యాధునిక గుండె చికిత్సలను మరింత మందికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించాయి.