50 అంత‌స్తుల్లో అద్భుత నిర్మాణం.. ఒక్కో ఫ్లాట్ ధ‌ర ఏకంగా రూ. 2 కోట్లు, ఎక్క‌డంటే.?

Published : Aug 27, 2026, 05:00 PM IST

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ ఏఎస్‌బీఎల్‌ కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఏఎస్‌బీఎల్ లెగ‌సీని ప్రారంభించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిర్మించిన‌ ఈ ప్రాజెక్టులో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి.

PREV
15
7.97 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్

ఏస్‌బీఎల్ లెగ‌సీ సుమారు 7.97 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందులో మూడు టవర్లు ఉంటాయి. ఒక్కో టవర్ గరిష్ఠంగా G+50 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. దీంతో RTC X రోడ్స్ ప్రాంతంలోనే ఇది అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ప్రాజెక్ట్‌లో 3, 4 BHK ఇళ్లు అందుబాటులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.1.99 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ప్రాజెక్ట్‌లో మొత్తం స్థలంలో 73.25 శాతం ఓపెన్ స్పేస్‌గా ఉంచనున్నారు. నివాసితుల కోసం సుమారు 74,000 చదరపు అడుగుల క్లబ్‌హౌస్, మరో 1.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 50కి పైగా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

25
స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌కు ప్రత్యేక సదుపాయాలు

ఏఎస్‌బీఎల్ లెగ‌సీలో నివ‌సించే వారి రోజువారీ అవసరాలతో పాటు స్పోర్ట్స్, ఫిట్‌నెస్, వినోదానికి సంబంధించిన అనేక సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. స్కైలైన్ వ్యూస్‌తో టెర్రస్ స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్, ఫుట్‌సాల్ కోర్టులు, పికిల్‌బాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే క్రికెట్ నెట్స్, స్కేటింగ్ రింక్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, పిల్లల ఆట స్థలాలు, పెట్ పార్క్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. సుమారు 17,000 చదరపు అడుగుల ఫెస్టివల్ లాన్ కూడా ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంటుంది.

35
ఒకే చోట పని, ఆరోగ్యం, చదువు

టవర్ B గ్రౌండ్ లెవల్‌లో సుమారు 12,000 చదరపు అడుగుల అర్బన్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కో-వర్కింగ్ స్పేస్‌లు, ఇండోర్ గేమ్స్, క్లినిక్, ఫిజియోథెరపీ రూమ్, ట్యూషన్ రూమ్ వంటి సదుపాయాలు ఉంటాయి. అంటే నివాసితులు తమ రోజువారీ అవసరాల్లో చాలా వాటిని కమ్యూనిటీ నుంచే పొందేలా ప్రాజెక్ట్‌ను రూపొందించారు. వాహనాలు లేని పోడియం, డబుల్ హైట్ లాబీ, రెండు మీటర్ల వెడల్పు గల కారిడార్లు, ప్రత్యేక ఫోయర్ ఎంట్రీలు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రతి అంతస్తులో ప్రతి యూనిట్‌కు ఒక లిఫ్ట్ ఉండేలా డిజైన్ చేశారు.

45
మెట్రో, రైల్వే స్టేషన్లకు దగ్గరగా

ASBL Legacyకి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి దాని కనెక్టివిటీ. RTC X రోడ్స్ మెట్రో స్టేషన్ ప్రాజెక్ట్‌కు కేవలం రెండు నిమిషాల దూరంలో ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్ సుమారు 8 నిమిషాల దూరంలో, MGBS సుమారు 15 నిమిషాల దూరంలో ఉన్నాయి. సెంట్రల్ హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ ప్రాంతాలు, కార్యాలయాలు, రవాణా సదుపాయాలకు దగ్గరగా ఉండటం వల్ల నగరంలోనే ఉండి ఆధునిక గేటెడ్ కమ్యూనిటీ జీవనశైలిని కోరుకునే వారికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.

55
సెంట్రల్ హైదరాబాద్‌లో ASBL కొత్త అడుగు

ASBL CEO, ఫౌండర్ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి ప్రధానంగా పశ్చిమ దిశగా సాగడానికి పెద్ద భూకమతులు అందుబాటులో ఉండటమే ప్రధాన కారణమని తెలిపారు. సెంట్రల్ హైదరాబాద్‌లో నివాసాలకు డిమాండ్ ఎప్పుడూ ఉందని, అయితే పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించడానికి అవసరమైన భారీ స్థలాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాజెక్టులు తక్కువగా వచ్చాయని వివరించారు. 2017లో ప్రారంభమైన ASBL హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ప్రాజెక్టులను చేపట్టింది. ఇటీవల ప్రారంభించిన ASBL Broadway లాంచ్ రోజునే అమ్మకాలు, EOIల రూపంలో రూ.1,000 కోట్లకు పైగా విలువను నమోదు చేయగా, ASBL Landmark రూ.500 కోట్లకు పైగా లాంచ్-డే బుకింగ్స్‌ను నమోదు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories