Gas Booking Tips : ఈ వాట్సాప్‌ నంబర్ కు 'హాయ్' చెబితే చాలు.. మీ ఇంటికే గ్యాస్ సిలిండర్

Published : Mar 11, 2026, 09:27 PM IST

మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం ప్రభావం మన వంటగదులపైనా పడింది. ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడుతుందని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మీ సిలిండర్ అయిపోతుంటే ఏజెన్సీకి వెళ్లే పనిలేకుండా ఈజీగా మొబైల్లోనే బుక్ చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.

PREV
16
ఇండియాలో వంటగ్యాస్ కష్టాలు..

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ రవాణాలో కీలకమైన హార్ముజ్ జలమార్గం మూతపడింది. దీంతో ఇండియాలో వంటగ్యాస్ (LPG) గ్యాస్ సరఫరా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ప్రభుత్వం సిలిండర్ ధరను ఇప్పటికే రూ.60 వరకు పెంచింది. అంతేకాదు గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఇక గృహ వినియోగానికి గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాల్లో హోటళ్లు, ఫ్యాక్టరీలకు (కమర్షియల్) గ్యాస్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు.

26
వాట్సాఫ్ నుండే సిలిండర్ బుకింగ్..

గ్యాస్ కొరత కారణంగా ఇకపై ఏజెన్సీల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.. ఈ తోపులాటల నుంచి తప్పించుకోవడానికి వాట్సాప్, మిస్డ్ కాల్ చాలా సులభమైన మార్గాలు. మీరు మీ గ్యాస్ కంపెనీ నంబర్‌కు వాట్సాప్, మెసేజ్ లేదా ఫోన్ కాల్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.

36
ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుకింగ్...

Indane Gas (ఇండియన్ ఆయిల్) 

WhatsApp: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 75888 88824కు 'REFILL' అని పంపండి. Missed Call: 84549 55555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

IVRS-SMS: మీరు 77189 55555 నంబర్‌కు కాల్ లేదా మెసేజ్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు.

46
హెచ్పి గ్యాస్ బుకింగ్

HP Gas (హెచ్‌పీ గ్యాస్) 

WhatsApp: 92222 01122 నంబర్‌ను సేవ్ చేసి, 'Hi' అని పంపండి. 

Missed Call: మీ నంబర్ నుంచి 94936 02222కు మిస్డ్ కాల్ ఇవ్వండి. 

App: మీరు 'HP Pay' యాప్ లేదా Amazon/Paytm ద్వారా కూడా పేమెంట్, బుకింగ్ ఒకేసారి చేయవచ్చు.

56
భారత్ గ్యాస్ బుకింగ్..

Bharat Gas (భారత్ గ్యాస్) 

WhatsApp: వీరి అధికారిక నంబర్ 1800224344కు 'Hi' అని పంపి బుకింగ్ మొదలుపెట్టండి. IVRS నంబర్: బుకింగ్ కోసం 7715012345 లేదా 7718012345 నంబర్లకు కాల్ చేయండి. 

SMS: 'LPG' అని టైప్ చేసి 7715012345కు పంపండి.

66
వెంటనే గ్యాస్ బుక్ చేసుకొండి

ఇప్పుడు గ్యాస్ బుకింగ్ కోసం 25 రోజుల నిబంధన అమల్లోకి వచ్చింది. కాబట్టి, మీ కోటా ఓపెన్ అయిన వెంటనే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి. ఆన్‌లైన్ బుకింగ్ (వాట్సాప్/యాప్) చేస్తే మీకు వెంటనే బుకింగ్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దీనివల్ల డెలివరీని ట్రాక్ చేయడం సులభం. ఒకవేళ మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకపోతే, మొదటిసారి ఏజెన్సీకి వెళ్లి లేదా IVRS ద్వారా దాన్ని తప్పకుండా అప్‌డేట్ చేసుకోండి. అప్పుడే మీరు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోగలరు.

Read more Photos on
click me!

Recommended Stories