Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?

Published : Jan 17, 2026, 02:20 PM IST

Home: ఇంటిని నిర్మించాలంటే క‌చ్చితంగా ఎంతో కొంత రుణం తీసుకోవాల్సిందే. బ్యాంకులు ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేట్ల‌తో హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. అయితే మీ ఇల్లు మెట్రో స్టేష‌న్‌కు స‌మీపంలో ఉంటే మీ ఈఎమ్ఐ భారం త‌గ్గుతుంద‌న్న విష‌యం మీకు తెలుసా.? 

PREV
15
మెట్రో దగ్గర ఇల్లు ఉంటే లాభం ఏంటి.?

ఇల్లు కొనాలంటే చాలామంది హోం లోన్ తీసుకుంటారు. ప్రతి నెల EMI చెల్లించాలి. మెట్రో స్టేషన్ సమీపంలో నివసించే వారికి ఈ EMI భారం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం చెబుతోంది. రవాణా ఖర్చులు తగ్గడం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

25
EAC-PM రిపోర్ట్ ఏమంటోంది.?

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇప్పటివరకు మెట్రో ప్రయోజనాలు ట్రాఫిక్ తగ్గింపు, ప్రయాణ సౌకర్యం వరకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఆర్థికంగా కూడా కుటుంబాలపై సానుకూల ప్రభావం చూపుతోందని రిపోర్ట్ స్పష్టం చేసింది.

35
రవాణా ఖర్చులు తగ్గితే EMI సులువు

మెట్రో వాడటం వల్ల ప్రైవేట్ వాహనాల అవసరం తగ్గుతుంది. పెట్రోల్ ఖర్చు, మెయింటెనెన్స్, పార్కింగ్ ఛార్జీలు తగ్గిపోతాయి. వాహన రుణం అవసరం లేకపోవడంతో నెలవారీ ఖర్చులు తగ్గుతాయి. దీని వల్ల హోం లోన్ EMI చెల్లించడం సులభమవుతుంది.

45
ఏ నగరాల్లో ఈ ప్రభావం కనిపించింది

ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మెట్రో విస్తరణ ముందు, తర్వాత పరిస్థితులను పోల్చి చూశారు. హైదరాబాద్‌లో హోం లోన్ డిఫాల్ట్ 1.7 శాతం తగ్గింది. బెంగళూరులో 2.4 శాతం తగ్గుదల కనిపించింది. ఢిల్లీలో అయితే డిఫాల్ట్ 4.42 శాతం వరకూ తగ్గింది.

55
తగ్గిన వాహనాల కొనుగోలు

మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత బైక్, కారు కొనుగోలు తగ్గినట్టు రిపోర్ట్ చెబుతోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వాహనాలు కొనకపోవడం వల్ల అదనపు లోన్లు తప్పుతున్నాయి. దీంతో కుటుంబ ఆర్థిక స్థితి బలపడుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories