Dmart : డీమార్ట్ లో ఇక ఆఫర్లే ఆఫర్లు.. మీ డబ్బులు ఆదా చేసుకునే షాపింగ్ చిట్కాలు

Published : Sep 16, 2025, 04:31 PM IST

Dmart :  డీమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్. కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు పండక్కి అవసరమైన వస్తువులను అతి తక్కువధరకే కొనుగోలు చేయవచ్చు… ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
16
డీమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్పెక్ట్ టైమ్

DMart : పండగల సీజన్ ప్రారంభమయ్యింది. వినాయక చవితితో ప్రారంభమైన పండగలు దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి ఇలా వరుసగా నాలుగైదు నెలలు పండగలే. ఇలా పెస్టివల్స్ సమయంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థల నుండి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు కొనుగోళ్లపై ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ సామాన్య మధ్యతరగతి ప్రజల సూపర్ మార్కెట్ గా గుర్తింపుపొందిన డిమార్డ్ కూడా మంచిమంచి ఆఫర్లను ప్రకటిస్తుంది. కాబట్టి ఇక్కడే పండక్కి సరుకులు కొనుగోలుచేయడంద్వారా లాభాలు పొందవచ్చు. కొన్ని చిట్కాలు పాటిస్తే మరింత సరసమైన ధరలకు డిమార్ట్ లో వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

26
డీమార్ట్ లో అతి తక్కువ ధరకే వస్తువులు

డీమార్ట్ మధ్యతరగతి ప్రజల మనసులు ఎప్పుడో గెలుచుకుంది. దీన్ని ఓ సూపర్ మార్కెట్ లా కాకుండా వీధి చివరకు ఉన్న కిరాణాషాప్ లాగే భావిస్తున్నారు... సరసమైన ధరలకే సరుకులు అందిస్తున్న దీంతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పర్చుకున్నారు. ఇంతలా కస్టమర్ల నమ్మకాన్ని పొందింది కాబట్టే డీమార్ట్ స్టోర్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. మెట్రో నగరాలు, చిన్న పట్టణాల్లో చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో డీమార్ట్ కు పోటీగా అనేక సూపర్ మార్కెట్లు పుట్టుకువస్తున్నాయి... వీటి పోటీని తట్టుకునేందుకు డీమార్ట్ కొన్ని వస్తువులను MRP కంటే తక్కువకు అంటే తయారీ కంపెనీ నిర్ణయించిన ధరకంటే తక్కువకే కస్టమర్లకు అందిస్తుంది. ఇలాంటి చర్యలే డిమార్ట్ ను మార్కెట్లో ఇంతకాలంగా నెంబర్ వన్ గా నిలబెడుతున్నాయి.

36
డీమార్ట్ లో ఎప్పుడు షాపింగ్ చేస్తే ఎక్కువ లాభం?

ముఖ్యంగా డీమార్ట్ లో ప్రతి వారాంతం రద్దీ ఎక్కువగా ఉంటుంది... కాబట్టి ఈ సమయంలోనే ఎక్కువగా డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అయితే వారాంతాలు కాకుండా మిగతారోజుల్లో కొన్ని వస్తువులను అతి తక్కువ ధరకే అందిస్తుంటాయి. ఇలా పాత స్టాక్ ను తక్కువ ధరకే వదిలించుకునే ప్రయత్నం చేస్తారు... కాబట్టి బాగా డిస్కౌంట్ ఉన్న వస్తువులను ఒకటికి రెండుసార్లు పరిశీలించి కొనుగోలు చేయాలి. తక్కువగా దొరకుతున్నాయంటే నాణ్యత ఉండవని అర్థంకాదు.. కానీ కొన్నిసార్లు ఇలా జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

46
ఇప్పుడు డీమార్ట్ లో భారీ ఆఫర్లు

ఇక ఇప్పుడు పండగల సీజన్... కాబట్టి డీమార్ట్‌లో ఎక్కువ డిస్కౌంట్లు ఉంటాయి. కిరాణా వస్తువులు, ఎలక్ట్రానిక్స్, బట్టలు ఇలా అన్ని వస్తువులు తక్కువ ధరకే కొనొచ్చు. కొన్నిసార్లు ఆన్‌లైన్ సైట్ల కన్నా తక్కువ ధరకే ఇక్కడ వస్తువులు దొరుకుతాయి. కాబట్టి ఈ పండగల సమయంలో డీమార్ట్ లో షాపింగ్ ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

56
నాణ్యతలో నిర్లక్ష్యం వద్దు

ధర తక్కువని నాణ్యతను నిర్లక్ష్యం చేయొద్దు... డిస్కౌంట్‌లో అమ్మే కొన్ని వస్తువులు పాత స్టాక్ కావచ్చు. ఆహార పదార్థాలు, కాస్మెటిక్స్ కొనేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ చూడాలి. లోదుస్తులు, కాస్మెటిక్స్ వంటి కొన్ని వస్తువులకు రిటర్న్ సౌకర్యం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొనాలి. "స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ (Limited Stock)" అని అమ్మే వస్తువులు తక్కువ నాణ్యతతో ఉండొచ్చు. ధర, నాణ్యత, రిటర్న్ పాలసీ చూసి కొనాలి. గడువు ముగియబోయే వస్తువులకు డీమార్ట్ ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుంది. వాటిని కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

66
డీమార్ట్ లో షాపింగ్ తో డబ్బులు ఆదా

కొన్ని సులభమైన పద్ధతులతో డీమార్ట్ షాపింగ్‌లో ఎక్కువ ఆదా చేయొచ్చు. నాణ్యత, గడువు తేదీ, రిటర్న్ పాలసీ చూసి కొంటే, మీ బడ్జెట్‌లో మంచి వస్తువులను తక్కువ ధరకే పొందొచ్చు. ఈ చిట్కాలు పాటించి మంచి వస్తువులు కొనండి.

Read more Photos on
click me!

Recommended Stories