Rain Alert : హైదరాబాద్ ప్రజలు ఇవాళ (మంగళవారం) సాయంత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతిభారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత కొద్దిరోజులుగా వానలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారినా వానలుమాత్రం తగ్గడంలేదు. మరీముఖ్యంగా తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి... ఇవి మరో వారంరోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లో అయితే ఇవాళ (సెప్టెంబర్ 16, మంగళవారం) కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ సోషల్ మీడియా వేదికన ప్రకటించారు. కేవలం జిహెచ్ఎంసి పరిధిలోనే కాదు శివారు జిల్లాల్లోనూ భారీ వర్షం తప్పదని హెచ్చరించారు.
26
సాయంత్రం భారీ వర్షం తప్పదా?
హైదరాబాద్ లో మంగళవారం ఉదయం నుండి వాతావరణం చల్లగా ఉంది. అయితే మరికొద్దిసేపట్లో నగరాన్ని దట్టమైన మేఘాలు కమ్మేసి మెళ్లిగా వర్షం ప్రారంభం అవుతుందని... ఇది సాయంత్రానికి భారీ వర్షంగా మారుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇలా సాయంత్రం నుండి రాత్రంతా హైదరాబాద్ లో అత్యంత భారీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు.
36
ఈ తెలంగాణ జిల్లాల్లోనూ కుండపోతే...
హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. అలాగే యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగానే ఉన్నా సాయంత్రానికి వర్షం ఊపందుకుంటుందని... రాత్రంతా కుండపోత వాన తప్పదని హెచ్చరిస్తున్రారు.
సోమవారం సాయంత్రం నుండి రాత్రంతా హైదరాబాద్ లో వర్షం కురిసింది. నగరంలో కూకట్ పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, రామచంద్రాపురం, పటాన్ చెరు, షేక్ పేట్, టోలిచౌకి, మెహదీపట్నం, బాలానగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కూకట్ పల్లిలో 37.8 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ లో 28.5, పటాన్ చెరులో 25.8, శేరిలింగంపల్లిలో 22.5, ఖైరతాబాద్ లో 15.8 మి.మీ వర్షం కురిసింది.
56
తెలంగాణ అత్యధిక వర్షపాతం ఎక్కడంటే...
తెలంగాణవ్యాప్తంగా పరిశీలిస్తే... సోమవారం సాయంత్రం నుండి మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా మెదక్ జిల్లా రేగోడ్ లో 125 మి.మీ వర్షం కురిసింది. మంచిర్యాల కాసింపేట్ మండలంలో 98 మి.మీ, సిరిసిల్ల కోనరావుపేటలో 95.8 మి.మీ, సిద్దిపేట తోగుటలో 89 మి.మీ, సంగారెడ్డి వనంపల్లిలో 77 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి.
66
భారీ వర్షాలతో తస్మాత్ జాగ్రత్త..
ఇప్పటికే భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి... జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారి ఉప్పొంగిపోతున్నాయి. ఈ భారీ వర్షాలతో కొన్నిచోట్ల వరద పరిస్థితులు నెలకొన్నాయి... గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టుప్రాంతాల్లో ఇళ్లలోని నీరుచేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.