ఢిల్లీ పేలుడు కేసు: హైదరాబాద్ లో ఒకరు అరెస్టు... వెలుగులోకి షాకింగ్ విషయాలు

Published : Nov 17, 2025, 06:51 PM ISTUpdated : Nov 17, 2025, 07:08 PM IST

Delhi Blast Probe: ఢిల్లీ ఎర్రకోట పేలుడు దర్యాప్తులో భాగంగా అల్ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ సోదరుడు హమూద్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే 25 ఏళ్ల పాత మోసం కేసు కూడా బయటకు రావడంతో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి.

PREV
16
ఢిల్లీ పేలుడు కేసు: హైదరాబాద్ లో అరెస్టులు

వివిధ విచారణలతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటికే పలువురిపై దర్యాప్తు కొనసాగుతుండగా, తాజాగా అల్ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్ సిద్దిఖీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్దిఖీని మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నకిలీ బ్యాంక్ మోసం కేసు ఈ దర్యాప్తులో వెలుగులోకి రావడం మరో కీలక అంశంగా మారింది.

26
25 ఏళ్ల పాత నకిలీ బ్యాంక్ మోసం: హమూద్ అరెస్ట్ ఎలా జరిగింది?

మధ్యప్రదేశ్‌లోని మహూ ప్రాంతంలో హమూద్ అహ్మద్ సిద్దిఖీ పేరు ఒకప్పటి నుండి పోలీసులు వెతుకుతున్న నిందితుల జాబితాలో ఉంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హమూద్ దాదాపు 25 ఏళ్ల క్రితం మహూలో ఒక నకిలీ ప్రైవేట్ బ్యాంకును ఏర్పాటు చేసి ప్రజల డబ్బును రెట్టింపు చేస్తామని చెప్పి వందలాది మందికి మోసం చేశాడు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో 2000లో కుటుంబంతో కలిసి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు.

దీర్ఘకాలం పాటు హమూద్‌ గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఇటీవల ఢిల్లీ పేలుడు కేసులో జావెద్ సిద్దిఖీపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, అతని కుటుంబ సభ్యులపై నిఘా పెంచిన పోలీసులు చివరకు హమూద్‌ను హైదరాబాద్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. లో-ప్రొఫైల్ జీవితం గడుపుతూ షేర్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

36
ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు: వెలుగులోకి మరిన్ని వివరాలు

నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 34 మంది గాయపడ్డారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ, ఆత్మాహుతి దాడి చేసిన ఉమర్ ఉన్ నబీతో కలిసి కుట్ర పన్నిన అమీర్ రషీద్ అలీని అరెస్టు చేసింది. పేలుడుకు ఉపయోగించిన i20 కారు అమీర్ పేరు మీదే రిజిస్ట్రేషన్ కావడంతో అతనిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఎన్ఐఏ అతనిని 10 రోజుల కస్టడీకి తీసుకుంది.

46
నేపాల్–కాన్పూర్ గాడ్జెట్ ట్రయిల్

ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. పేలుడు కుట్రదారులు నలుగు వారాల ముందే బ్లూప్రింట్ సిద్ధం చేశారనీ, నేపాల్‌లో ఏడు సెకండ్‌హ్యాండ్ మొబైల్స్ కొనుగోలు చేశారని దర్యాప్తు వర్గాలు గుర్తించాయని సమాచారం. 

కాన్పూర్‌లో 17 సిమ్ కార్డులు తెచ్చుకున్నారు, అందులో ఆరు కాన్పూర్ స్థానిక ఐడీలతో తీసుకున్నవి కాగా, స్విస్ యాప్ త్రీమా ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించారు. దీనితోనే నిందితుల నెట్వర్క్ దేశ సరిహద్దులు దాటి విస్తరించినట్టు ఎన్ఐఏ భావిస్తోంది.

56
వైద్యులపై నిఘా: ఉమర్‌కు సంబంధం ఉన్నవారి అరెస్టులు

ఉమర్‌తో పరోక్ష లేదా ప్రత్యక్ష సంబంధం ఉన్న పలువురు వైద్యులు కూడా దర్యాప్తు రాడార్‌లోకి వచ్చారు. వారిలో డాక్టర్ పర్వేజ్ (అల్-ఫలాహ్ యూనివర్సిటీ వైద్యురాలు షహీన్ సయ్యద్ సోదరుడు), డాక్టర్ మహమ్మద్ అరిఫ్ (జీఎస్వీఎం మెడికల్ కాలేజీ), డాక్టర్ ఫరూక్ అహ్మద్ దార్.. వీరు ఉమర్‌తో నవంబర్ 8 వరకూ సంప్రదింపులు జరిపినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

66
దేశవ్యాప్తంగా సోదాలు: మరిన్ని అరెస్టులు

హర్యానా వైద్యురాలు ప్రియాంక శర్మను కూడా విచారణ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. జైషే మహ్మద్ వంటి నిషేధిత సంస్థలతో సంబంధమున్న అదీల్ అహ్మద్‌తో ఆమెకు పరిచయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అమీర్, ఉమర్, హమూద్ లింకులు బయటపడుతున్న కొద్దీ ఢిల్లీ పేలుడు కేసు మరింత విస్తృత మలుపు తిరుగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories