Holidays 2025 : డిసెంబర్ 2025 లో ఎన్నిరోజులు సెలవులున్నాయి..? తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏరోజు, ఎందుకు సెలవు వస్తుంది? అసలు క్రిస్మస్ కు వచ్చే సెలవులెన్ని?
December Holidays : ఇయర్ ఎండ్ వచ్చేసింది... ఇంకో నెలరోజులు (డిసెంబర్) గడిచిపోతే చాలు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాం. పాత సంవత్సరానికి ఆనందందో వీడ్కోలు పలుకుతూ న్యూఇయర్ ను హ్యాపీగా ప్రారంభించాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసమే డిసెంబర్ లో కుటుంబం, స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు విహారయాత్రలకు వెళుతుంటారు. ఈ నెలలో వచ్చే సెలవులను బట్టి టూర్స్ ప్లాన్ చేసుకుంటారు. మరి ఈ డిసెంబర్ లో ఎన్నిరోజులు సెలవులున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
25
తెలంగాణలో క్రిస్మస్ సెలవులెన్ని?
విదేశాల్లోనే కాదు భారతదేశంలోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు తమ ఇష్టదైవం యేసుక్రీస్తును తలచుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తెలంగాణలోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి… డిసెంబర్ 25న పండగపూట సాధారణ సెలవు ఉంది.
అయితే తెలంగాణలో క్రిస్మస్ తర్వాతిరోజు డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) కూడా సాధారణ సెలవే. అంటే తెలంగాణ ఉద్యోగులకు రెండ్రోజులు క్రిస్మస్ సెలవులు ఇస్తున్నారు. ముందురోజు క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఐచ్చిక సెలవుగా ప్రకటించింది ప్రభుత్వం. ఉద్యోగులు కావాలనుకుంటే డిసెంబర్ 24న కూడా వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.
ఇక సాధారణ విద్యాసంస్థలకు కూడా క్రిస్మస్ కి రెండ్రోజులు సెలవులు ఉంటుంది... ఈ రెండు వీకెండ్ తో కలిసివస్తున్నాయి కాబట్టి నాల్రోజుల సెలవులుగా మారవచ్చు. కొన్ని స్కూళ్లకు డిసెంబర్ 25 గురువారం, 26 శుక్రవారం, 27 శనివారం, 28 ఆదివారం నాల్రోజుల సెలవులుండే అవకాశాలున్నాయి. క్రిస్టియన్ స్కూళ్లకు డిసెంబర్ 21 నుండి 28 వరకు 8 రోజులు సెలవులుంటాయి.
35
ఆంధ్ర ప్రదేశ్ క్రిస్మస్ సెలవులెన్ని?
ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం డిసెంబర్ 25 క్రిస్మస్ పండగరోజే అధికారిక సెలవు ఇచ్చారు. ముందురోజు (డిసెంబర్ 24న) క్రిస్మస్ ఈవ్, తర్వాతిరోజు (డిసెంబర్ 26న) బాక్సింగ్ డే కు ఐచ్చిక సెలవు తీసుకోవచ్చని ప్రకటించింది. అంటే అవసరం ఉన్నవారే ఈ రెండ్రోజుల సెలవులను పొందవచ్చు.
ఏపీలో విద్యాసంస్థలకు కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ పండగపూటే సెలవు ఉంది. క్రిస్టియన్ మిషనరీలు, ఎస్సి గురుకులాలు, క్రిస్టియన్ విద్యార్థులు ఎక్కువగా చదివే విద్యాసంస్థలకు మాత్రం ఎక్కువరోజులు సెలవులు ఉంటాయి.
డిసెంబర్ లో క్రిస్మస్ పండగతో పాటు ఆదివారాలు, రెండో శనివారం కలిపి మొత్తం 9 రోజులు సెలవులు వస్తున్నాయి. డిసెంబర్ 7,14,21,28 నాలుగు ఆదివారాలు ... డిసెంబర్ 13 రెండో శనివారం సెలవే. వీటికి క్రిస్మస్ డిసెంబర్ 24,25,26 సెలవులు అదనం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగులకు డిసెంబర్ 2025 లో మొత్తం 8 రోజుల సెలవులు వస్తున్నాయి.
55
డిసెంబర్ లో బ్యాంక్ హాలిడేస్
వచ్చే నెల డిసెంబర్ లో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సెలవు... ఇలా దేశవ్యాప్తంగా చూసుకుంటే 16 రోజుల సెలవులు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు, డిసెంబర్ 25న క్రిస్మస్... మొత్తంగా ఏడ్రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మిగతారోజుల్లో యధావిధిగా బ్యాంకులు నడుస్తాయి.