Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు

Published : Dec 21, 2025, 06:53 AM IST

Cold Wave: చ‌లి తీవ్ర‌త ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా చ‌లి చంపేస్తోంది. ఉద‌యం 8 గంట‌ల‌కు కూడా కొన్ని చోట్ల పొగ మంచు క‌మ్ముకుంటోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే 2 రోజులు చ‌లి తీవ్రత మ‌రింత పెర‌గ‌నుంద‌ని చెబుతున్నారు. 

PREV
15
తెలంగాణలో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చ‌లి పంజా విసురుతోంది. రాత్రి వేళ నుంచి ఉదయం వరకూ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. సాయంత్రం ఆరు గంటలు దాటిన వెంటనే చలి తీవ్రత మొదలవుతోంది. ఉదయం పది గంటలు అయినా చలి తగ్గడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.

25
సింగిల్ డిజిట్‌లోకి ఉష్ణోగ్ర‌త‌లు

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అత్యధికంగా ఉంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో కనిష్ఠంగా 6.1 డిగ్రీలు నమోదయ్యాయి. మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ తీవ్ర చలి కొనసాగుతోంది. మొత్తం 19 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

35
పొగమంచుతో జనజీవనం అస్తవ్యస్తం

తీవ్ర చలి ప్రభావంతో పాటు పొగమంచు ప్రజలను ఇబ్బందిపెడుతోంది. ఉదయం వేళల్లో రహదారులపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది. పొలాలకు వెళ్లే రైతులు, పనులకు బయలుదేరే కూలీలు చలికి వణుకుతున్నారు. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణ జీవనం పూర్తిగా స్థంభించింది.

45
అలెర్ట్‌లు, పాఠశాలల మార్పులు

వచ్చే రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శనివారం జనగామ తప్ప మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇవ్వ‌గా.. ఆదివారం 22 జిల్లాలకు, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ అమలులో ఉంటుంది. మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పాఠశాలల పనివేళల్లో మార్పులు చేశారు.

55
చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తీవ్ర చలి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఉదయం వేళల్లో, రాత్రి సమయంలో బయటకు రాకపోవడం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, సాక్సులు తప్పనిసరిగా ధరించాలి. గోరువెచ్చని నీరు తాగాలి. వేడి ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తి పెరిగే ఆహార పదార్థాలు తీసుకుంటే చలి ప్రభావం నుంచి కొంతవరకు రక్షణ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories