Airport: హైద‌రాబాద్ ఒక్క‌టే కాదు.. ఈ ప్రాంతాల్లో కూడా రియ‌ల్ బూమ్ ఖాయం. కొత్త ఎయిర్ పోర్టులు

Published : Jan 20, 2026, 12:07 PM IST

Airport: తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం హైద‌రాబాద్‌లో మాత్ర‌మే ఎయిర్ పోర్ట్ ఉంద‌ని తెలిసిందే. అయితే అతి త్వ‌ర‌లోనే కొత్త‌గా  విమానాశ్ర‌యాలు రానున్నాయి. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. 

PREV
15
తెలంగాణలో విమానాశ్రయాల విస్తరణకు వేగం

తెలంగాణలో విమానయాన రంగం విస్తరణ దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. మొత్తం ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్న ప్రణాళికపై అధికార యంత్రాంగం వేగంగా పని చేస్తోంది.

25
భూసేకరణపై ప్రత్యేక దృష్టి

రవాణా, రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడెం ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియకు గట్టి ఊపొచ్చింది. ఇప్పటికే వరంగల్ పరిధిలో భూసేకరణ పూర్తయ్యింది. మిగతా ప్రాంతాల్లో కూడా భూముల సేకరణ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

35
మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు భారీ కదలిక

వరంగల్ సమీపంలోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనులు కీలక దశలో ఉన్నాయి. మార్చి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. ఇప్పటికే ఉన్న 696.14 ఎకరాలకు తోడు మరో 253 ఎకరాల భూసేకరణ పూర్తైంది. భూసేకరణ, పునరావాస చర్యల కోసం గతంలో రూ.295 కోట్లు విడుదల చేయగా, తాజాగా మరో రూ.90 కోట్లు మంజూరు చేశారు.

45
ఆదిలాబాద్, రామగుండం ప్రాజెక్టుల పురోగతి

ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎయిర్‌ఫోర్స్ అధికారిని నియమించారు. మొత్తం 700 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటికే 362 ఎకరాల AIF భూమి అందుబాటులో ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండం సమీపంలోని అంతర్గాం ప్రాంతంలో గత డిసెంబర్‌లో ఏవియేషన్ బృందం క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది.

55
త్వరలో కార్యరూపం దాల్చే విమానాశ్రయాలు

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈ నెలాఖరుకు ప్రభుత్వానికి చేరనుంది. కొత్తగూడెం ప్రాంతంలో ప్రతిపాదిత స్థలాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రత్యామ్నాయ భూముల కోసం జిల్లా కలెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్, మహబూబ్‌నగర్ ప్రాజెక్టులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అవి ముందుకు సాగేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories