Holidays : సంక్రాంతి సెలవులు ముగిశాయి… అయితే తెలంగాణలో మళ్లీ ఈ స్థాయి హాలిడేస్ ఈ నెలలోనే రానున్నాయా..? మేడారం జాతర నేపథ్యంలో సెలవులు ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది.
School Holidays : సంక్రాంతి సెలవులు ముగిశాయి... వారం రోజులకు పైగా హాలిడేస్ ఎంజాయ్ చేసిన విద్యార్థులు మళ్ళీ స్కూల్ బాట పట్టారు. తెలంగాణలో గత శనివారం(జనవరి 17న) స్కూళ్లు పున:ప్రారంభం అయ్యాయి.. ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఇప్పటికే పండగ కోసం సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగి పట్టణాలకు చేరుకున్నారు... పిల్లలను స్కూల్స్ కి పంపిస్తున్నారు. ఇన్నిరోజులు గాలిపటాలు ఎగరేస్తూ, రంగవళ్లులు, బోగిమంటలతో స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్న పిల్లలకు ఒక్కసారిగా స్కూల్ కి వెళ్లమంటే బాధగానే ఉంటుంది. ఈ బాధను కాస్త తగ్గించేలా ఈ వీకెండ్ వరుస సెలవులు వస్తున్నాయి... ఈ లాంగ్ వీకెండ్ గురించి తెలుసుకుందాం.
25
లాంగ్ వీకెండ్... వరుసగా రెండ్రోజులు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ వారాంతంలో రెండ్రోజులు సెలవులే. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు కూడా వరుస సెలవులు వస్తున్నాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సోమవారం వస్తోంది... ఈరోజు జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత విద్యార్థులకు సెలవే. అయితే ముందురోజు (జనవరి 25) ఆదివారం కాబట్టి సాధారణ సెలవే. ఇలా సంక్రాంతి సెలవుల తర్వాత ఉసూరుమంటూ బడిబాట పట్టిన విద్యార్థులకు ఈ లాంగ్ వీకెండ్ కాస్త ఊరట ఇవ్వనుంది.
35
ఈ స్కూల్స్ కి మూడ్రోజుల సెలవులు...
హైదరాబాద్, విశాఖపట్నం వంటి ఐటీ సిటీస్ లో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. ఇలాంటి విద్యాసంస్థలకు జనవరి 26 సెలవు కలిసివస్తోంది... అన్ని స్కూల్స్ కి కేవలం రెండ్రోజులు సెలవుంటే ఈ స్కూల్స్ కి వరుసగా మూడ్రోజులు (జనవరి 24,25,26) సెలవులు వస్తున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్స్ కి వెళ్లాల్సి వచ్చినా జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత పంపించేస్తారు.. ఎలాంటి క్లాసులు ఉండవు.
కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా శని, ఆదివారం రెండ్రోజులు సాధారణ సెలవులే. అలాగే బ్యాంక్ ఉద్యోగులకు ప్రతి నెలా రెండు, నాలుగో శనివారం సెలవులుంటాయి. జనవరి 24న నాలుగో శనివారం కాబట్టి సెలవు ఉంటుంది... ఇక జనవరి 25 ఆదివారం, జనవరి 26 రిపబ్లిక్ డే హాలిడే. ఇలా ఉద్యోగులకు ఈసారి లాంగ్ వీకెండ్… వరుసగా మూడ్రోజులు సెలవులే.
55
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ సెలవులుంటాయా..?
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు రంగం సిద్దమయ్యింది... మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు కోట్లాది మంది తరలిరానున్నారు. జనవరి 28 నుండి 31 మేడారం జాతర జరగనుంది... ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాకున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేడారం జాతర సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చే అవకాశాలున్నాయి. ఇలా మేడారం జాతరకు సెలవులిస్తే మరో ఏడ్రోజులు (జనవరి 25,26,27,28,29,30,31) వరుస సెలవులు రానున్నాయి.