తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే గంటకు 50 నుండి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వడగళ్ల వర్షం కూడా పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు జిల్లాల్లో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.