ప్రభుత్వం మీ కాల్ డేటా ఎందుకు సేవ్ చేయాలనుకుంటోంది.. ఇది మీ ప్రైవసీని ఉల్లంఘించడమేనా ?

First Published | Dec 25, 2021, 7:12 PM IST

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT), యూనిఫైడ్ లైసెన్స్ ఒప్పందాన్ని సవరిస్తూ వినియోగదారుల కాల్ డేటా రికార్డులను రెండేళ్లపాటు సేవ్ చేయాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. కొన్ని సెక్యూరిటి అజెన్సీల నుండి వచ్చిన అభ్యర్థనల తర్వాత ఈ ఆర్డర్ తీసుకోబడింది. ఇప్పటి వరకు కాల్ రికార్డ్ డేటాను 18 నెలల పాటు సేవ్ చేసుకోవాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లాభనష్టం ఏమిటి అలాగే కాల్ రికార్డ్ డేటా అంటే ఏమిటి? చూద్దాం..

కాల్ డేటా రికార్డ్ (CDR) అంటే ఏమిటి?
ఏదైనా నిర్ణయానికి సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకునే ముందు నిర్ణయం యొక్క అర్థం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం ? కాల్ డేటా రికార్డ్ (CDR) అంటే ఏ నంబర్ నుండి కాల్ చేశారు , ఏ నంబర్‌కు కాల్ చేశారు, ఎంతసేపు కాల్ చేశారు, అదే నంబర్‌కు ఎన్నిసార్లు కాల్ చేశారు, ఏ నెట్‌వర్క్‌తో  కాల్స్ చేశారో అని అర్థం. కాల్ మరేదైనా నంబర్‌కు ఫార్వార్డ్ చేయబడిందా.. లేదా దీనికి అవును అయితే ఏ నంబర్‌కు, ఎక్కడ నుండి కాల్ చేయబడింది అని. సి‌డి‌ఆర్ డేటా అంటే మీ కాల్ వాయిస్ రికార్డింగ్ కాదు.  సి‌డి‌ఆర్ డేటా టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంచబడుతుంది.
 

మీ సి‌డి‌ఆర్ ని ఎవరు చూడగలరు?
సి‌డి‌ఆర్ యాక్సెస్‌కి సంబంధించి ఒక చట్టం కూడా ఉంది. మీ సి‌డి‌ఆర్ ని ఎవరైనా చూడగలిగేలా ఉండదు. నిబంధనల ప్రకారం, ఎస్‌పి అండ్ అంతకంటే ఎక్కువ స్థాయి అధికారి మాత్రమే టెలికాం ఆపరేటర్ల నుండి లేదా ఏదైనా విచారణ విషయంలో సి‌డి‌ఆర్ తీసుకోవచ్చు. ప్రతి నెలా ఈ సమాచారం డీఎంకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
 

Latest Videos


సి‌డి‌ఆర్ డేటాను స్టోరేజ్ చేయడంలో తప్పు ఏమిటి?
ముందుగా, సి‌డి‌ఆర్ డేటా భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా స్టోర్ చేయబడుతుంది. ఇది సాధారణ విషయం. ఏదైనా విచారణ విషయంలో కొన్నిసార్లు కాల్ వివరాలు అవసరం అలాగే దీని కోసం సి‌డి‌ఆర్ స్టోర్ చేయబడుతుంది. ఇందులో వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించే సమస్య ఉండదు.

టెలికాం కంపెనీలు సి‌డి‌ఆర్ డేటాను నిర్ణీత వ్యవధిలో ఉంచుతాయి, ఇది టెలికాం శాఖకు కూడా తెలుసు. దీనికి సంబంధించిన కాలాన్ని టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్ణయిస్తుంది. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఇంకా వివిధ కోర్టుల నిర్దిష్ట అభ్యర్థనలకు టెలికాం కంపెనీలు సి‌డి‌ఆర్ లను మంజూరు చేయడానికి లైసెన్స్‌లో తప్పనిసరి షరతు, దీనికి కూడా సూచించిన ప్రోటోకాల్ ఉంది.

నిపుణులు ఏమంటున్నారు?
ఈ విషయంలో సైబర్ లా (cyber law)నిపుణుడు మాట్లాడుతూ.. ఈ నిర్ణయం న్యాయమైన నిర్ణయమని చెప్పారు. ఇది చాలా కాలంగా దర్యాప్తు సంస్థల డిమాండ్, అది ఇప్పుడు నెరవేరింది. దర్యాప్తును పునఃప్రారంభించేటప్పుడు పాత డేటా చాలా అవసరం. కేస్ ఇన్వెస్టిగేషన్ కి కూడా చాలా సహాయపడుతుంది. నేరానికి ఏడాది లేదా రెండు సంవత్సరాల ముందు వినియోగదారు ప్రవర్తన ఎలా ఉండేది, అతను ఎవరితో మాట్లాడాడు, ఎలాంటి వెబ్‌సైట్‌ని సందర్శించాడు.

అటువంటి సమాచారం తరువాత కేసులు త్వరగా పరిష్కరించబడతాయి ఇంకా పెండింగ్ కేసులను కూడా త్వరగా పరిష్కరించవచ్చు. కొన్నిసార్లు విదేశీ సంబంధిత విషయాల్లో పాత డేటా కూడా అవసరమవుతుంది. దర్యాప్తు విషయంలో విదేశాల నుండి డేటాను సేకరించడానికి సాధారణంగా ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది ఇంకా దర్యాప్తు కూడా ఆలస్యం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం దర్యాప్తు సంస్థలకు ఎంతగానో ఉపకరిస్తుంది.

click me!