వాట్సాప్‌లో కనిపించని 6 ప్రత్యేకమైన సిగ్నల్ యాప్ ఫీచర్లు ఇవే..

First Published Jan 26, 2021, 3:03 PM IST

వాట్సాప్‌తో ప్రైవసీ పాలసీ వివాదం తర్వాత సిగ్నల్ మెసేజింగ్ యాప్ డౌన్‌లోడ్ లు గణనీయంగా పెరిగిపోయాయి, దీంతో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని 3 నెలల పాటు వాయిదా వేసింది. మరో వైపు ఈ వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ వివాదం కారణంగా భారతదేశంలో మిలియన్ల మంది వినియోగదారులు వాట్సాప్ నుండి సిగ్నల్‌కు మారుతున్నారు. అయితే  సిగ్నల్ యాప్ లోని చాలా ఫీచర్స్  వాట్సాప్ నుండి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాట్సాప్‌లో లేని  ఈ 6 ఫీచర్ల గురించి తెలుసుకోండి ఎందుకంటే  మీరు వీటిని సిగ్నల్‌లో  మాత్రమే చూడగలుగుతారు.
 

వర్చువల్ నంబర్సిగ్నల్‌లో యాప్ లోని అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే మీరు దీన్ని వర్చువల్ ఫోన్ నంబర్ ద్వారా ఉపయోగించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మీ అసలైన మొబైల్ నెంబర్ ఎవరికీ తెలియదు. అలాగే సిగ్నల్ యాప్ మీ కాంటాక్ట్స్ లిస్ట్ ని ట్రాక్ చేయదు. రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ నంబర్ అవసరం అయినప్పటికీ, సిగ్నల్ యాప్ వర్చువల్ నంబర్ ద్వారా ఓ‌టి‌పిని ధృవీకరిస్తుంది.
undefined
పిన్ను ఆక్టివేషన్సిగ్నల్ యాప్ అక్కౌంట్ మీ ఫోన్ నంబర్‌కు లింక్ చేయదు. దీని ప్రత్యేకత ఏమిటంటే యాప్ రిజిస్ట్రేషన్ పిన్ ద్వారా జరుగుతుంది, దీని వల్ల మీ సమాచారం మీకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పిన్ కారణంగా సిగ్నల్ యాప్ వినియోగదారుని ట్రాక్ చేయడం చాలా కష్టం. మీరు ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్లి రిజిస్ట్రేషన్ లాక్‌కి వెళ్లడం ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు.
undefined
రీడ్ రిసిప్ట్స్సిగ్నల్ యాప్ ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా మీరు ఆల్వేస్ రిలే కాల్స్ ను ఆన్ చేయవచ్చు. అలాగే మీరు రీడ్ రిసిప్ట్స్ నిలిపి వేయవచ్చు. దీని ప్రయోజనం ఏమిటంటే మీ ఐ‌పి అడ్రస్ లీక్ అవ్వదు.
undefined
స్క్రీన్ టైం అవుట్అనవసరమైన మెసేజెస్ లను నివారించేందుకు మీరు కనీసం ఒక నిమిషం పాటు స్క్రీన్ టైం అవుట్ సెట్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్ చేసుకున్నా తర్వాత ఒక నిమిషం తర్వాత మీ యాప్ లాక్ అవుతుంది. దీని ద్వారా మీ యాప్ ని, అనవసరమైన మెసేజెస్ లను ఇతరులు యాక్సెస్ చేయలేరు.
undefined
ఆలో ఫ్రోం ఎనివన్యాప్ ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా మీరు ఆలో ఫ్రోం ఎనివన్ ఆప్షన్ ఆన్ చేయవచ్చు. దీని తరువాత ఇతరులు లేదా తెలియని వారు మీకు మెసేక్ చేయలేరు, మీకు కావలసిన వ్యక్తులు మాత్రమే మీకు మెసేజ్ చేయడానికి వీలుంటుంది.
undefined
డిసపియరింగ్ మెసేజెస్డిసపియరింగ్ మెసేజె ఫీచర్ ఇటీవల వాట్సాప్‌ ప్రవేశపెట్టింది, అయితే ఈ ఫీచర్ అంతకుముందే సిగ్నల్‌ యాప్ లో ఉంది. మీరు సిగ్నల్ యాప్ మెసేజెస్ డిస్ ప్లేను 5-10 సెకన్ల పాటు సెట్ చేయవచ్చు, ఆ తర్వాత మీ మెసేజ్ ఆటోమేటిక్ గా తొలగించబడుతుంది.
undefined
click me!