వర్క్ ఫ్రోం హోంకి బెస్ట్ ఇంటర్నెట్ ప్లాన్స్ ఇవే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ స్పీడ్, ఓ‌టి‌టి బెనెఫిట్స్ కూడా..

First Published | Jan 26, 2022, 4:28 AM IST

కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం సామాజిక దూరం, మస్కూలు ధరించడం వంటి మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఇందులో భాగంగా చాలా స్కూళ్లు, కాలేజీలు, పెద్ద పెద్ద కంపెనీలు షట్ డౌన్ చేయవల్సి వచ్చింది. దీంతో పాటు ఉద్యోగులను ఇళ్లలోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని కొన్ని కంపెనీలు కోరాయి. 

మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు దృశ్య ఆన్‌లైన్‌ క్లాసెస్ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు ఈ పనులన్నీ ఇంటర్నెట్ ద్వారా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది, ఇందుకు ప్రజలకు మంచి ఇంటర్నెట్ ప్లాన్ అవసరం. ఈ కారణంగా ఈ రోజుల్లో ఇంటర్నెట్  బ్రాడ్‌బ్యాండ్‌కు డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. మీరు కూడా మంచి ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ వార్త మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీకు గొప్ప ఇంటర్నెట్ స్పీడ్ తో ఓ‌టి‌టి బెనెఫిట్స్ అందించే 5 ప్లాన్‌ల గురించి మీకోసం... ఈ ప్లాన్లతో  మీరు ఆన్‌లైన్ క్లాసెస్ ఆస్వాదించవచ్చు ఇంకా ఇంటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు...
 

రూ. 399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
బి‌ఎస్‌ఎన్‌ఎల్  ప్లాన్ గురించి మాట్లాడితే ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ. 399, దీనితో మీకు 200జి‌బి డేటా లభిస్తుంది. ఇంకా మీరు 10 Mbps స్పీడ్ తో ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కూడా పొందుతారు. అలాగే ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. డేటా అయిపోయినప్పుడు స్పీడ్ 2 Mbpsకి తగ్గించబడుతుంది.

Latest Videos


ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్
ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవల్ ప్లాన్ గురించి మాట్లాడితే మీకు రూ. 499తో 30 రోజుల వాలిడిటీ లభిస్తుంది.  అలాగే 400 Mbps వేగంతో 3.3 TB వరకు ఆన్ లిమిటెడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్‌తో పాటు షో అకాడమీ అండ్ వింగ్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
రిలయన్స్ జియో మీకు రూ. 399కి ఆన్ లిమిటెడ్ డేటా అండ్ 30 Mbps స్పీడ్‌తో  కాలింగ్ ప్లాన్ సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే దీనికి ఎలాంటి ఓ‌టి‌టి ప్రయోజనాలు ఉండవు.  కానీ జియో మీకు తక్కువ ధరకే ఆన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది.
 

జియో రూ 699 ప్లాన్
మరోవైపు జియో మీకు 100 Mbps వేగంతో ఆన్ లిమిటెడ్ డేటాతో పాటు  కాలింగ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో ఎలాంటి ఓ‌టి‌టి ప్లాట్‌ఫారమ్‌కు సబ్‌స్క్రిప్షన్ లభించదు. కానీ అధిక వేగం కోసం మీరు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

అంతేకాకుండా, రిలయన్స్ జియో 999 రూపాయలకు 150 Mbps వేగంతో ఆన్ లిమిటెడ్ డేటా, ఉచిత కాలింగ్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో మీరు 16 యాప్‌ల ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందుతారు. వీటిలో అమెజాన్ ప్రైమ్, సోని లీవ్,  డిస్ని హాట్ స్టార్ ప్లస్, జి5, ఆల్ట్ బాలాజి  యాప్‌లు ఉన్నాయి.

click me!