ఆపిల్, గూగుల్‌, యూట్యూబ్‌పై పబ్-జి దావా: మా గేమ్ ని కాపీ కొట్టడమే కాకుండా భారీగా లాభాలను కూడా..

First Published | Jan 15, 2022, 9:27 AM IST

పబ్-జి(PUBG)గేమ్‌ను అభివృద్ధి చేసిన క్రాఫ్టన్ కంపెనీ ఆపిల్, గూగుల్‌పై దావా వేసింది. గూగుల్, ఆపిల్‌తో పాటు ఫ్రీ ఫైర్ (Free Fire)అండ్ ఫ్రీ ఫైర్ మాక్స్‌( Free Fire Max)ను అభివృద్ధి చేసిన గరెనా కంపెనీపై కూడా క్రాఫ్టన్  దావా పడింది.

ఫ్రీ ఫైర్, ఫ్రీ ఫైర్ మాక్స్‌ పబ్-జి గేమ్‌ని కాపీ చేసి గూగుల్ ప్లే స్టోర్ అండ్ ఆపిల్ యాప్ స్టోర్ లో  వాటి యాప్‌లను పబ్లిషింగ్ చేసేందుకు అనుమతించాయి. క్రాఫ్టన్  కంపెనీ యూట్యూబ్‌పై కూడా దావా వేసింది. మొత్తం మీద ఈ విషయం కాపీరైట్‌కు సంబంధించినది. యూట్యూబ్ ఫ్రీ ఫైర్ గేమ్‌ప్లే వీడియోలను తన సొంత ప్లాట్‌ఫారమ్‌లోనే ప్రసారం చేసిందని క్రాఫ్టోన్ తెలిపింది.
 

ఫ్రీ ఫైర్ అండ్ ఫ్రీ ఫైర్ మాక్స్   పబ్-జి బ్యాటిల్ గౌండ్ అన్నీ ఫీచర్లను కాపీ చేశాయని క్రాఫ్టన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు గేమ్‌లు కాపీ చేసిన ఫీచర్లలో ఎయిర్ డ్రాప్ ఫీచర్, గేమ్ స్ట్రక్చర్ అండ్ ప్లే, ఆయుధాలు, కవచం, ప్రత్యేకమైన వస్తువులు, లొకేషన్‌లు అండ్ టెక్చర్స్ తో కలర్స్ ఉన్నాయి.

అయితే గారెనా మా గేమ్ ఫీచర్లను కాపీ కొట్టి కోట్లాది రూపాయలను ఆర్జించిందని క్రాఫ్టన్ పేర్కొంది. ఇందులో గూగుల్, యాపిల్ కూడా భారీగా డబ్బు సంపాదించాయని కంపెనీ చెబుతోంది. గరెనా 2017లో సింగపూర్‌లో ఒక గేమ్‌ను ప్రారంభించిందని, అయితే ఆ గేమ్ పబ్-జి గేమ్‌కి కాపీ అని క్రాఫ్టోన్ తెలిపింది. పబ్-జి డెవలపర్లు కంపెనీపై దావా వేయడం ఇది మొదటిసారి కాదు. 2018లో క్రాఫ్టోన్  ఫోర్ట్‌నైట్‌పై కూడా దావా వేసింది.

Latest Videos


భారతదేశంలో పబ్-జి ని నిషేదించిన తరువాత  బ్యాటిల్ గౌండ్ మొబైల్ ఇండియా (BGMI) పేరుతో గేమ్ ని తిరిగి  ప్రారంభించింది. బి‌జి‌ఎం‌ఐ తాజాగా కేవలం ఒక వారంలోనే 60 వేలకు పైగా గెమర్స్ ఖాతాను నిషేధించింది. గేమ్‌ను రూపొందించిన క్రాఫ్టన్ కంపెనీ ఈ సమాచారాన్ని స్వయంగా ఇచ్చింది. అయితే గేమ్‌లో మోసాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈసారి క్రాఫ్టన్ గేమ్‌లోని  ఫ్రాడ్ ఖాతాల పేర్లను కూడా పబ్లిక్‌గా ఉంచింది. డిసెంబర్ 13-19 మధ్య కంపెనీ 1 లక్షకు పైగా ఖాతాలను నిషేధించింది. డిసెంబర్ 6 నుండి 12 మధ్య 1,42,000 మంది గెమర్స్ గేమ్‌లో మోసం చేస్తూ పట్టుబడ్డారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల కారణంగా 58,611 ఖాతాలను నిషేధించామని క్రాఫ్టన్ తన బ్లాగ్‌లో తెలిపింది. ఈ ఖాతాలపై చర్యలు డిసెంబర్ 20-26 మధ్య జరిగాయి. గేమ్‌లో మోసాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదని కంపెనీ తెలిపింది.

click me!