రిలయన్స్ జియో మొదటి 5జి ఫోన్ ఫీచర్స్ లీక్.. బెస్ట్ ఫీచర్స్ తో తక్కువ ధరకే అందుబాటులోకి..?

First Published Jan 27, 2022, 3:27 AM IST

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో  మొదటి 4జి ఫోన్‌ను 2021 సంవత్సరంలో ప్రవేశపెట్టింది, దీనిని జియో  ఫోన్ నెక్స్ట్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే జియో ఫోన్ నెక్స్ట్ ని గూగుల్ భాగస్వామ్యంతో అభివృద్ధిచేసింది. 

తాజాగా జియో ఫోన్ త్వరలో 5జి ఫోన్‌ను పరిచయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో జియో ఫోన్ 5జి భారతదేశంలోనే అత్యంత చౌకైన 5జి ఫోన్ అని లీక్నివేదికలో తెలిపింది.

ధర దాదాపు రూ.10 వేల వరకు 
నివేదిక ప్రకారం, జియో ఫోన్ 5జి ధర రూ. 10వేల కంటే తక్కువగా ఉండనుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చౌకైన 5జీ ఫోన్ ధర రూ.13,999. జియో 5జి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్ మీ, పోకో వంటి కంపెనీల ఫోన్‌లతో పోటీపడుతుంది.

స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ సపోర్ట్ 
అలాగే తక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ మాత్రమే తక్కువ ధరకు లభిస్తుందని మీకు తెలుసు. జియో ఫోన్ 5జితో 5జి సపోర్ట్ లభిస్తుంది, అయితే హై ఎండ్ ఫీచర్లు ఊహించలేము. స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ని జియో ఫోన్ 5జిలో చూడవచ్చు, ఇది Qualcomm చౌకైన 5G ప్రాసెసర్. జియో ఫోన్‌తో 5G, N3, N5, N28, N40 ఇంకా N78 5G బ్యాండ్‌లకు సపోర్ట్ ఉంటుంది.
 

32జి‌బి స్టోరేజ్‌తో
అంతేకాకుండా, 4G ర్యామ్ అండ్ 32 జి‌బి స్టోరేజ్ జియో ఫోన్ 5జితో అందించవచ్చు. జియో ఫోన్ 5Gలో 6.5-అంగుళాల ఎల్‌సి‌డి హెచ్‌డి + డిస్ ప్లే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆండ్రాయిడ్ 11 ఫోన్‌తో రావొచ్చు. ఇంకా అన్ని జియో యాప్‌లు ఫోన్‌తో ప్రీ ఇన్‌స్టాల్ చేయబడతాయి.

ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా 
జియో  మొదటి 5జి ఫోన్‌లో డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది, దీనిలో ప్రాథమిక లెన్స్ 13 మెగాపిక్సెల్‌, రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్‌లు. ముందు భాగంలో, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000mAh బ్యాటరీని జియో ఫోన్ 5Gలో చూడవచ్చు, దీనితో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంటుంది.
 

click me!