భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. ఈసారి బుర్జ్ ఖలీఫా కంటే రెండు రెట్లు పెద్దది: నాసా

First Published Jan 18, 2022, 6:09 PM IST

చాలా కాలంగా గ్రహశకలాలు(Asteroids) భూమికి ముప్పుగా వర్ణించబడుతున్నాయి. అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే పెను విపత్తు తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి చుట్టూ తిరిగే ఒక పెద్ద గ్రహశకలం ఒక్కసారి మాత్రమే భూమిని ఢీకొట్టిందని, ఆ తర్వాత డైనోసార్‌లు ప్రపంచం నుండి తుడిచిపెట్టుకుపోయాయని చేబుతుంటారు.

దీని తరువాత భూమి గుండా నుండి వెళుతున్న గ్రహశకలాలు ఢీకొనడం గురించి చాలాసార్లు చర్చ జరిగింది, కానీ అది ఎప్పుడూ జరగలేదు. 

ఇప్పుడు అంటే ఈ రోజు  జనవరి 18న బుర్జ్ ఖలీఫా కంటే రెట్టింపు పరిమాణంలో ఉన్న ఓ గ్రహశకలం భూమికి సమీపం నుండి వెళ్లనుంది. ఇది 7482 (1994 PC1) అనే అతిపెద్ద గ్రహశకలం అని చెప్పబడింది. ఈ గ్రహశకలం పొడవు 1 కిలోమీటరు అంటే 3280 అడుగులు. ఇది భూమికి 19.3 లక్షల కిలోమీటర్ల దూరంలో వెళుతుంది. అందువల్ల, భూమికి తక్కువ ప్రమాదం ఉంది. దీని మార్గంలో స్వల్పంగా మార్పు వచ్చినా భూమికి ప్రమాదకరంగా పరిణమించడంతో పాటు విధ్వంసం సృష్టించవచ్చు. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇది ప్రమాదకరమని ప్రకటించింది.

ఇంత పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొంటే పెను విధ్వంసం తప్పదని నాసా చెబుతోంది. అందుకే అటువంటి గ్రహశకలంని నాసా  పెను ముప్పు జాబితాలో ఉంచింది. 7482 (1994PC1) భూమికి 19.3 లక్షల కి.మీ దూరం నుండి వెళుతుందని నాసా చెప్పినప్పటికీ దీనిని మొదటిసారిగా 1994 సంవత్సరంలో కనుగొనబడింది. 
    

89 సంవత్సరాల క్రితం 17 జనవరి 1933న గ్రహశకలం 7482 (1994 PC 1) భూమికి సమీపం నుంచి  వెళ్లింది. అప్పట్లో అది 11 లక్షల కిలోమీటర్ల దూరం దాటింది. ఇప్పుడు అది 18 జనవరి 2105న భూమికి దగ్గరగా వెళ్లనుంది. గ్రహశకలాలు భూమిని ఢీకొనకుండా అపెందుకు సాంకేతికతను కనుగొనడంలో యూ‌ఎస్ అంతరిక్ష సంస్థ నిమగ్నమై ఉంది. ఇందుకోసం అమెరికా అంతరిక్ష సంస్థ డార్ట్ మిషన్‌(DART)ను కూడా ప్రయోగించింది. 
 

గ్రహశకలం అంటే ఏంటి  
 ఒక గ్రహం ఏర్పడే సమయంలో దాని నుండి చిన్న రాతి ముక్కలు బయటకు వచ్చి సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు అది దాని కక్ష్య నుండి బయటకు వస్తుంది. గ్రహ కక్ష్యలలో సాధారణంగా గ్రహశకలాలు కాలిపోతాయి, కానీ పెద్ద గ్రహశకలాలు కొన్నిసార్లు గ్రహాలను ఢీకొంటాయి. గ్రహశకలాలు చాలాసార్లు భూమిని కూడా ఢీకొన్నాయి.
 

సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడిన సమయంలో మిగిలిపోయిన ఆస్టరాయిడ్​ గా చెప్పుకొనే ఈ భారీ గ్రహశకం గురించి శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. ఈ గ్రహశకలం గంటకు 70,416 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ భూమివైపు దూసుకొస్తుంది. భూమి- చంద్రుడి మధ్య దూరం కన్నా 5.15 రెట్లు అధికమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు 


ఈ తరహా గ్రహశకలాలు ప్రతి ఆరు లక్షల సంవత్సరాలకు ఒకసారి భూ గ్రహాన్ని ఢీకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వచ్చే 200 ఏళ్లలో మనకు అత్యంత సమీపంలోని గ్రహశకలం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ గ్రహశకలం వేగం సెకనుకు 12 మైళ్లు ఉంటుందని చెబుతున్నారు. 
 

click me!