లీకైన డేటాలో వినియోగదారుల పేరు, ఇమెయిల్, పాస్‌వర్డ్, మొబైల్ నంబర్ వంటివి ఉన్నట్లు సమాచారం . ఈ డేటాను హ్యాకర్లు హ్యాకింగ్, బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ డేటా లీక్ గురించి మొదట సైబర్ న్యూస్ సమాచారం ఇచ్చింది. ఈ లీక్ గురించి ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్ కూడా ధృవీకరించింది.
undefined
సైబర్ న్యూస్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, మైఫ్రీకామ్స్ అనే పోర్న్ వెబ్‌సైట్ నుండి సుమారు 20 లక్షల వినియోగదారుల డేటా లీక్ అయినట్లు దృవీకరించింది. లీక్ అయిన సమాచారాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ డేటా అమ్మకానికి బిట్‌కాయిన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. 10 వేల మంది వినియోగదారుల డేటా విలువ సుమారు 1,500 డాలర్ల బిట్‌కాయిన్లకు అమ్మకానికి పెట్టారు.
undefined
దీనిపై మైఫ్రీకామ్స్ కూడా లీక్‌కు సంబంధించి వివరణ ఇచ్చినట్లు, అలాగే వినియోగదారులందరి పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసినట్లు చెప్పారు. లీకైన డేటా నమూనాలో వినియోగదారుల పేరు, ఇమెయిల్ ఐడి, మైఫ్రీకామ్స్ టోకెన్ బ్యాలెన్స్, పాస్‌వర్డ్ వంటి సమాచారం ఉంది. హ్యాకర్లు వినియోగదారుల టోకెన్ బ్యాలెన్స్‌ను కూడా మాయం చేసి వారి డేటాను హ్యాకింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు అని తెలిపింది.
undefined
ఇది కాకుండా మీ సమాచారం, మీ కుటుంబం, స్నేహితులతో పంచుకునే అవకాశం కూడా ఉంది. పిషింగ్ దాడిలో ఇ-మెయిల్ ని ఎక్కువగా ఉపయోగించవచ్చు. మైఫ్రీకామ్స్ అనేది ఒక ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్, దీని నెలవారీ వినియోగదారుల సంఖ్య 70 మిలియన్లు, అంటే 7 కోట్లు. కాబట్టి మీరు కూడా ఈ వెబ్‌సైట్ వినియోగదారు అయితే, మీ పాస్‌వర్డ్‌ను వీలైనంత త్వరగా రీసెట్ చేయడం మంచిది.
undefined